జగన్ విసిరిన సవాల్ కు, నిన్న పవన్ ఘాటుగా స్పందించటంతో, వైసిపీ విలవిలలాడుతుంది... ఎప్పుడో పార్లమెంట్ సమావేశాలు అయిపోయే టైంకి ఎందుకు, ఇప్పుడే అవిశ్వాస తీర్మానం ఇవ్వండి, మీరు అడిగినట్టు, నేను మద్దతు కూడగడతా అని పవన్ అనటంతో, వైసిపీ పార్టీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, పవన్ పై ఎదురు దాడి మొదలు పెట్టింది... నిజానికి అవిశ్వాస తీర్మానం ఇవ్వాలి అంటే, రెండు వారల ముందు ఇవ్వాలి అనే నిబంధన ఉంది... జగన్ కనుక పార్లమెంట్ అయిపోయే సమయంలో ఇస్తే, అది ఎందుకు పనికిరాదు... అందుకే పవన్, ఇప్పుడే అవిశ్వాస తీర్మానం పెట్టండి, మీ సవాలు స్వీకరించి, మీకు మద్దతు నేను ఇస్తా అని చెప్పారు...
కాని జగన్ కు ఉన్న ఇబ్బందులు తెలుసుగా... ఎదో మాటలు అయితే చెప్తాడు కాని, మోడీ, నువ్వు అంటే నాకు విశ్వాసం లేదు, అని పేపర్ మీద సంతకం పెట్టే దమ్ము జగన్ పార్టీకి ఉందా ? ఒకవేళ అది జరిగితే ఏమవుతుందో అందరికీ తెలుసు... అందుకే వైసిపీ ఎదురుదాడి మొదలు పెట్టింది ... అసలు జగన్ సవాల్ ను పవన్ స్వీకరించటం ఏంటి, అసలు జగన్ ఎక్కడ సవాల్ విసిరాడు, అంటూ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి పవన్ పై ఎదురు దాడి మొదలు పెట్టాడు... జగన్ ఎక్కడా సవాళ్లు చేయలేదని, 'మీ పార్టనర్ ను ఒప్పించండి' అన్నందుకు మీకేమైనా బాధేసిందా? అని అంబటి అన్నారు...
అవిశ్వాస తీర్మానం ఐదో తారీఖున పెట్టండి.. ఆరో తారీఖున పెట్టండంటూ పవన్ చైల్డిష్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలతో సంబంధం లేకుండా తమ పోరాటవ్యూహంలో భాగంగా ముందుకెళుతామని స్పష్టం చేశారు. మార్చి 5వ తేదీ నుంచి తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనలు కొనసాగిస్తారని, ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలో మాకు తెలుసని అంబటి అన్నారు... తమ పార్టీ ఓ షెడ్యూల్ ను ముందుగానే నిర్ణయించుకుందని, దాని ప్రకారం ముందుకు సాగుతామని తెలిపారు. దాన్ని కాదని ఇవాళే పెట్టండి, రేపు పెట్టండి అంటూ చైల్డిష్ గా పవన్ ఎందుకు ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదని అన్నారు...