మంత్రి అంబటి రాంబాబు నుంచి తమకు ప్రాణ హాని ఉందని అనిల్ తల్లిదండ్రులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఎంఆర్ఎప్ చెక్ ఇవ్వడానికి అంబటి రాంబాబు లంచం అడిగాారని ఆరోపణలు చేసిన దంపతులకు వైసీపీ నేతల నుంచి బెదిరింపు కాాల్స్ వచ్చాయి. నేరుగా కొందరు వైసీపీ నేతలు వచ్చి మరీ వారిని హెచ్చరించి వెళ్లారని సమాచారం. హడలిపోయిన పర్లయ్య, గంగమ్మ దంపతులు సత్తెనపల్లి పీఎస్లో మంత్రి అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. తమను లంచం అడగడం నిజమని, అదే చెప్పామని అప్పటి నుంచి తమకు వైసీపీ నేతలు ఫోన్ చేసి చంపేస్తామంటున్నారని వాపోయారు. అంబటి, వైసీపీ నేతల నుంచి రక్షణ కల్పించాలని అనిల్ తల్లిదండ్రుల పోలీసులను కోరారు.
Advertisements