నీటిపారుద‌ల శాఖా మంత్రి అంబ‌టి రాంబాబు అన్నివిధాలుగా వార్త‌ల్లో వ్య‌క్తి. ఇప్పుడు మ‌రో విష‌యంలోనూ అంబ‌టిపై అంద‌రి దృష్టి ప‌డింది. అంబ‌టిపై  సొంత నియోజ‌క‌వ‌ర్గంలో, సొంత పార్టీ వైసీపీ నుంచే అస‌మ్మ‌తి స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఇవి ఏకంగా స‌త్తెన‌ప‌ల్లి సీటుకే ఎస‌రు పెట్టే స్థాయికి చేరాయి. సత్తెనపల్లి వైసీపీ నేత‌ చిట్టా విజయభాస్కర్ రెడ్డి పార్టీ ఆత్మీయ సమావేశం పెట్టి అంబ‌టి పేరు ప్ర‌స్తావించ‌కుండానే  వైసీపీకి డ్యామేజ్ చేస్తున్న‌వాళ్లు ఎంత పెద్ద‌వాళ్ల‌యినా లెక్క‌చేయ‌మంటూ వ్యాఖ్యానించారు. స‌త్తెన‌ప‌ల్లిలో బ‌ల‌మైన కేడ‌ర్ త‌న‌కు ఉంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌త్తెన‌ప‌ల్లి టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని విజయభాస్కర్ రెడ్డి ఈ స‌మావేశంలో డిమాండ్ చేశారు. మ‌రోవైపు స‌త్తెన‌ప‌ల్లికి చెందిన వైసీపీ నేత సయ్యద్ మాబుకు విభేదాలు మంత్రి అంబటి రాంబాబుకి విభేదాలు తీవ్రం అయ్యాయి. దీంతో మాబు కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అంబ‌టి రాంబాబుతో అంటీముట్ట‌న‌ట్టు ఉంటున్నారు. దీంతో మాబు పార్టీ వీడుతార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌లే టిడిపిలో చేరిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సత్తెనపల్లిలో వైసీపీ నేత సయ్యద్ మాబు ఇంటికి వెళ్లారు. సత్తెనపల్లి రాజకీయాలపై మాబుతో కన్నా చర్చలు జ‌రిపార‌ని స‌మాచారం. ఓ వైపు కీల‌క నేత టికెట్ రేసులో ఉన్నాన‌ని ప్ర‌క‌టించ‌డం, మ‌రోవైపు మ‌రో కీల‌క నేత పార్టీ వీడేలా కనిపిస్తుండ‌డంతో అంబ‌టికి స‌త్తెన‌ప‌ల్లిలో చెక్ పెట్టే దిశ‌గా వైసీపీ అసంతృప్తులు పావులు క‌దుపుతున్నారు. అంబ‌టి రాంబాబుకి సొంత పార్టీ నుంచే ఎదుర‌వుతున్న ఇబ్బందులు త‌మ‌కి ప్ల‌స్సుగా మార్చుకునే వ్యూహంతో టిడిపి చురుగ్గా త‌మ వ్యూహాన్ని అమ‌లు చేస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read