డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 130వ జయంతినాడే, ఆ మహనీయుడిని వైసీపీప్రభుత్వం అవమానించిందని, సాక్షిపత్రికలో ప్రచురించిన ఆ మహనీయుడి చిత్రం అవహేళనగా, వ్యంగ్యంగాఉందని, అవినీతిపరులు, డెకాయిట్ల ఫొటోల్లా సాక్షిపత్రికలో ప్రచురించారని టీడీపీ అధికారప్రతినిధి పిల్లిమాణిక్యరావు మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ... "అంబేద్కర్ చిత్రాన్ని ఆ విధంగా ప్రచురించడం ఎవరూ చేయని సాహసం. అంబేద్కర్ మహనీయుడి చిత్రాన్ని సాక్షిపత్రికలో వ్యంగ్యంగా, అవహేళనగా ముద్రించారు. అవినీతిపరులు, కుంభకోణాలకు పాల్పడేవారు, డెకాయిట్ల ఫోటోమాదిరి అంబేద్కర్ ఫొటోని ప్రచురించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్పందించాలి. అలా ప్రచురించినందుకు జగన్మోహన్ రెడ్డి దళితజాతికి క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకుంటే దళితులంతా సాక్షి పత్రికను బహిష్కరిస్తారు. అంబేద్కర్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని అభివర్ణించడం కంటే సిగ్గుమాలిన తనం మరోటిలేదు. అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నది జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అమలుచేయడం లేదు. దళితులకు రక్షణగా అంబేద్కర్ తీసుకొచ్చిన చట్టాలను జగన్ అమలుచేస్తున్నాడా? శ్రీకాకుళం నుంచి చిత్తూరువరకు దళితులను నానారకలుగా హిం-సి-స్తుం-టే ఏనాడూ నోరెత్తని వైసీపీలోని దళితనేతలు, జగన్మోహన్ రెడ్డి దళితులకోసం పాటుపడుతున్నాడని చెప్పడం, ఆయా వర్గాలను వంచించడమే అవుతుంది. మేరుగనాగార్జున మాటలు వింటుంటే, అసలు ఆయన దళితుడేనా అన్న అనుమానం కలుగుతోంది. రాష్ట్రంలో అడుగడుగునా దళితులను అవమానిస్తున్నది జగన్ ప్రభుత్వమేననే విషయం నాగార్జునకు తెలియదా? దళితులను వేధిస్తున్నవారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటోంది"
"దళితులను పిచ్చివాళ్లను చేసింది, వారికి శిరోముండనాలు చేసింది, వారిపై అట్రాసిటీ కేసులపెట్టింది.... వారిపై అ-త్యా-చా-రా-లు-, హ-త్య-ల-కు పాల్పడింది అందరూ వైసీపీనేతలు, కార్యకర్తలే. దళితుల అవకాశాలను, అభివ్రుద్ధిని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. వివేకా హ-త్య పై లోకేశ్ విసిరిన సవాల్ పై జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదు. కేసు విచారణపై రాష్ట్రప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని జగన్ ప్రతిపక్షంలోఉన్నప్పుడు అన్నాడు. కేసు విచారణను ఆనాడు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన వ్యక్తి, అధికారంలోకి వచ్చాక దోషులను ఎందుకు పట్టుకోలేదు. వారు పట్టుబడితే తనకే ప్రమాదమని ఆయన భావిస్తున్నాడా? తన బాబాయిని చం-పిం-ది ఇంటిదొంగలేనని ముఖ్యమంత్రికి తెలుసు. తమకు, తమకుటుంబానికి సంబంధంలేదని, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణానికి సిద్ధమని లోకేశ్ అంటే, జగన్ ఎందుకు జారుకున్నాడు. కేసు విచారణలో సీబీఐఎందుకు ముందుకెళ్లలేకపోతోందని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆలోచన చేయడం లేదు. ఆనాడు ఎన్టీఆర్ పక్కన చేరి, టీడీపీని కబళించాలని ఒక శిఖండి చూసింది. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆ శిఖండి నుంచి టీడీపీని చంద్రబాబు కాపాడారని కన్నాలేసే కన్నబాబు తెలుసుకుంటే మంచిది. టీడీపీని కాపాడుకోవడంతో పాటు, గడపగడపకు అభివ్రుద్ధిని పరిచయం చేసిన ఘనత చంద్రబాబుది. తన తండ్రిని చం-పిం-ది రిలయన్స్ వారేనన్న జగన్, ఇప్పుడు వారితో రాసుకుపూసుకు తిరగడమేంటి?
రిలయన్స్ వారే తనతండ్రిని చం-పి-తే, జగన్ వారితాలూకా మనిషిని ఎందుకు రాజ్యసభకు పంపాడు? తప్పుడు ప్రమాణాలతో తనక్షేత్రాన్ని అపవిత్రం చేస్తాడని, ఏడుకొండలకు అపకీర్తి కలుగుతుందని ఏడుకొండలవాడే ముఖ్యమంత్రిని తిరుపతికి రాకుండా చేశాడు. సొంత బాబాయిని చం-పిం-ది ఇంటిదొంగలేనని ముఖ్యమంత్రికి తెలుసు. బయటివారు చం-పి-తే జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టేవాడా? జగన్ కు, ఆయన కుటుంబంలోని వారికి వివేకా హ-త్య-తో సంబంధం లేకుంటే, ఆయన ఎందుకు ప్రమాణానికి రాలేదు. తల్లిని, చెల్లిని రోడ్డుపై పడేసింది జగన్ కాదా? ఒక చెల్లి ఢిల్లీ వీధుల్లో తనకు న్యాయం చేయాలని విలపిస్తుంటే, ఆమెకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోతున్నాడు. మరోచెల్లి తెలంగాణ వీధుల్లో తిరుగుతోంది. ఏడుకొండలవాడి సాక్షిగా తిరుపతిని, తిరుమలక్షేత్రాన్ని జగన్ బారినుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తిరుపతి పార్లమెంట్ ఓటర్లదే. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థికి ఓటేసే ముందు ఓటర్లంతా ఒక్కసారి ఆలోచన చేయాలి. తండ్రి శ-వం తాలూకా ర-క్త-పు ముద్దలను పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రిపదవికోసం జగన్ ఆరాటపడ్డాడు. వ్యక్తిగత సేవచేసే వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి మరణించిన దళితఎంపీ కుటుంబాన్ని, దళితజాతిని తీవ్రంగా అవమానించాడు. తిరుపతి పార్లమెంట్ తోపాటు, రాష్ట్రాన్ని కాపాడుకునేదిశగా తిరుపతివాసులు ఆలోచన చేయాలి. తిరుపతి పార్లమెంట్ ఓటర్లు అత్యధిక మెజార్టీతో పనబాకలక్ష్మిని గెలిపిస్తే, జగన్ జైలుకెళ్లడం ఖాయమని స్పష్టంచేస్తున్నా." అంటూ చెప్పుకొచ్చారు.