2004-09 మధ్య రౌడీయిజంతో రాష్ట్రానికి అప్రదిష్ట వచ్చిందని, ఆ ఐదేళ్లలో ఫ్యాక్షనిస్టులు పేట్రేగిపోయారని, ప్రస్తుతం రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. వైసీపీ నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ‘ఆంబోతులను కట్టడి ఎలా చేయాలో నాకు తెలుసు’ అని ఆయన అన్నారు. బుధవారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓట్ల తొలగింపు కుట్రలో ఏ-1 నిందితుడు జగన్ అన్నారు. ఫారమ్ 7 దుర్వినియోగం వైసీపీకి సిగ్గుచేటని, ఫారమ్-7 దుర్వినియోగం చేశామని జగనే ఒప్పుకున్నాడని, ఫారమ్-7 దరఖాస్తులు 13లక్షలు పంపుతారా..? అని ప్రశ్నించారు.

cbn tele 06032019

అలాగే బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఫారమ్ 7 కుట్రలు జరిగాయని, ఓట్లు పోయిన వాళ్లంతా జగన్‌ను నిలదీయడమేగాక ఓటు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలన్నారు. తప్పులు చేయడం, శిక్షలు అనుభవించడం జగన్‌కు అలవాటేనని, జగన్ వల్ల ఎందరో కేసుల్లో చిక్కుకున్నారని, జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తప్పులు చేసేవాళ్లు, నేరగాళ్లకే వైసీపీలో చోటు లభిస్తుందని, వైసీపీలో ఉంటే ఎవరైనా తప్పులు చేయాల్సిందేనన్నారు. నేరాలు, ఘోరాలు చేసే ఆలోచనలు వైసీపీ చేస్తోందని, అభివృద్ధి, సంక్షేమం ఆలోచనలు టీడీపీ చేస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఓట్లు గల్లంతైన వారంతా జగన్‌ను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.

cbn tele 06032019

‘ఓట్ల తొలగింపు, కుల రాజకీయాలు, ఎన్టీఆర్‌ విగ్రహాల ధ్వంసం వంటి తప్పుడు పనులకు వైసీపీ పాల్పడుతోంది. అంతటితో ఆగకుండా పొరుగు రాష్ట్రం నుంచి మనపై కుట్రలకు తెగబడ్డారు. జగన్‌ అరాచకాలు శ్రుతిమించాయి. ఓటమి భయంతోనే ఈ కుట్రలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. అహంకారం నెత్తికెక్కి టీఆర్‌ఎస్‌ విపరీత చేష్టలకు పాల్పడుతోంది. వాళ్లకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. హద్దులు దాటుతున్నారు. అధికారంతో ఏదైనా చేస్తామంటే చూస్తూ ఊరుకోం’ అని చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్న టీఆర్‌ఎస్‌, వైసీపీ, బీజేపీల తప్పుడు విధానాలను ఎండగట్టాలని.. వీళ్ల కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు. ‘కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. ఆంధ్రను సామంత రాజ్యం చేసుకోవాలనేదే కేసీఆర్‌ కుట్ర. జగన్‌ను లొంగదీసుకుని దాడులకు తెగబడ్డారు. కేసీఆర్‌కు ఆయన సామంతరాజుగా మారారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌.. ముగ్గురూ ఉమ్మడి ప్రచారం చేయండి. ప్రజలే మీ అరాచకాలకు తగిన బుద్ధి చెబుతారు’ అని స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read