ఆంధ్రప్రదేశ్ పరువు పోయింది. ఇప్పటికే అప్పులు విషయంలో, రాష్ట్ర పరువు దేశ వ్యాప్తంగా పోయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారుతూ ఉండటంతో, అన్ని ఫైనాన్స్ సంస్థలు మనల్ని పక్కన పెట్టినట్టు చూస్తున్నాయి. ఇక పొతే, ఈ మధ్య ప్రపంచ బ్యాంక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం నేపధ్యంలో, ఇప్పుడు మరో సంస్థ కూడా ఏపి ప్రభుత్వాన్ని దూరం పెట్టింది. ఇక నుంచి ఏపి ప్రభుత్వానికి ఎలాంటి మెడికల్ డివైజస్ సరఫరా చేయవద్దు అంటూ, ఇండియన్ మెడికల్ డివైసెస్ ఇండస్ట్రీ, రెడ్ నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు సంబంధించిన రెడ్ నోటీసులను తన వెబ్సైటులో ఉంచింది. దాదాపుగా మూడు ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి బిల్లులు చెల్లించక పోవటం, ప్రభుత్వం తీసుకున్న ఆర్డర్లుకు ఏవైతే టెండర్లు దక్కించుకుని వాళ్ళు, మెడికల్ దివైజస్ సరఫరా చేసారో, వాటి అన్నిటికీ నేటి వరకు, నయా పైసా బిల్లు ఇవ్వక పోవటంతో, అనేక సార్లు సంప్రదింపులు జరిపినా కూడా ఫలితం లేకపోవటంతో, ఇండియన్ మెడికల్ డివైసెస్ ఇండస్ట్రీ ఈ రోజు రెడ్ నోటీస్ జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెడ్ నోటీస్ జారీ చేస్తూ, తమ వెబ్సైటులో పెట్టింది.
తమ ఆధ్వర్యంలో ఉండే ఆ ఇండస్ట్రీ సమాఖ్యలో ఉండే 500 కంపెనీలను ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబందించిన టెండర్ లో పాల్గునవద్దని, ఎటువంటి ఉపకరణాలు సరఫరా చేయవద్దు అని కూడా ఆ రెడ్ నోటీసు లో పేర్కొంది. అదే విధంగా ఎవరైనా సరఫరా చేయాలి అనుకుంటే, అది మీ ఓన్ రిస్క్ అని, అది తమకు సంబంధం లేదని తెలిపింది. అయితే ఒక వేళ ఎవరైనా సరఫారా చేయాలి అనుకుంటే మాత్రం, వంద శాతం డబ్బు అడ్వాన్స్ గా చెల్లించిన తరువాత మాత్రమే, ఆయా టెండర్లకు సంబంధించిన సరుకు సరఫరా చేయాలని సూచించింది. దాదాపుగా వేల కోట్ల రూపాయల బిల్లింగులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. ఎవరు అయితే సరఫరా చేసారో, ఆ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపినా ఉపయోగం లేకపోవటంతో, ఇండియన్ మెడికల్ డివైసెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారం, మొత్తం తమ సమాఖ్యకు ఈ మేరకు తమ వెబ్సైటులో ఉంచుతూ, ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇది ఏపి ప్రభుత్వానికి పరువు పోయే విషయం అనే చెప్పాలి. మరి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలి.