అమెరికాలో తానా 22వ మహా సభలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గునటానికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ కూడా వచ్చారు, అయితే ఈ వేడుకులు అయిపోయిన తర్వాత, వీరు ఇరువురు భేటీ కావటం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ను వెనుక ఉండి నడిపిస్తుంది బీజేపీనే అన్న అభిప్రాయం మొన్నటి దాకా ఉంది. మొన్న ఎన్నికల దాకా, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ వెళ్ళటం, చివరి వరకు బీజేపీని ఒక్క మాట అనకపోవటం చూసిన తరువాత ఈ అభిప్రాయం బలపడింది. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం పవన్ శైలి మార్చి చివర్లో బీజేపీని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తరువాత, బీజేపీ రాష్ట్రం పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నాయకులను లాక్కునే పనిలో ఉంది. ఈ స్కెచ్ అంతా వేస్తుంది రాంమాధవ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో రాంమాధవ్ , పవన్ కళ్యాణ్ తో భేటీ కావటం, ఆసక్తి రేపుతుంది.
ఫ్రెండ్లీ అలయన్స్ పెట్టుకుని జనసేన, బీజేపీ ముందుకు వెళ్తాయా, లేకపోతె అందరూ ఊహిస్తునట్టు, పవన్ కళ్యాణ్ జెండా ఎత్తేసి, బీజేపీలో చేరిపోతారా అనే చర్చ కూడా జరుగుతంది. పవన్ కళ్యాణ్ అన్నయ్య, చిరంజీవి కూడా బీజేపీలోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారని, ఎప్పటి నుంచో ప్రచారం కూడా జారుతుంది. ఈ నేపధ్యంలో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. అయితే ఈ భేటీ పై బయటకు మాత్రం, ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన చట్టం హామీల గురించి పవన్ కళ్యాణ్, బీజేపీ నేతతో చర్చించినట్టు మీడియాకు చెప్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితి పై మాత్రమే చర్చలు జరిగాయాని చెప్తున్నారు. ఈ భేటీ పై రామ మాధవ్ మాట్లాడుతూ, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు. పవన్ కనిపిస్తే మాట్లాడానని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం పై స్పందించారు. రాం మాధవ్ తో వ్యక్తిగత పరిచయం ఉందని, అందులో భాగంగానే మాట్లాడానని, బీజేపీతో కలిసి పని చేసే ఉద్దేశం లేదని అన్నారు. అయితే రాంమాధవ్ లాంటి నేతతో ఒక పార్టీ అధ్యక్షుడు భేటీ అయ్యారు అంటే, దానికి రాజకీయ ప్రాధాన్యత లేదు అని చెప్పటం మాత్రం కామెడీగా ఉంది.