భారత్‌లో ఆమెరికా రాయబారి కెన్నత్ జస్టర్ ఈరోజు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించారు. ఏపీలో సమర్థ నాయకత్వం ఉందని కితాబు ఇచ్చిన కెన్నెత్ ఐ జస్ట .అమెరికాలోని పరిశ్రమలు ఏపీ వైపు ఆసక్తిగా చూస్తున్నాయని తెలిపిన కెన్నెత్ ఐ జస్టర్. పెట్టుబడులు, అభివృద్ధికి మంచి వాతావరణం ఏపీ లో ఉంది. యువత భవిష్యత్ కు ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. ఏపీలో చేపట్టిన సాంకేతిక పరిజ్ఞానం, సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని జస్టర్ కోరారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ కలిశారు. ఈ సందర్భంగా ఈ-ప్రగతి, ఆర్టీజీఎస్, సాంకేతిక వినియోగం తదితర అంశాలను సీఎం వివరించారు. సులభతర వాణిజ్యంలో మొదటి స్థానానికి అనుసరించిన విధానాలను ముఖ్యమంత్రి తెలియజేశారు.
అమరావతి మ్యూజియాన్ని సందర్శించి.. బౌద్ధ మత వ్యాప్తిని, విశిష్టతను తెలుసుకున్నారు. అమరావతిలో బుద్ధుడి అవశేషాలు కొలువైన మహా చైత్యం స్థూపాన్ని సందర్శించారు. ఇటలీ కంటే వెయ్యేళ్ల ముందే భారతీయ నాగరికత, సంస్కృతి విలసిల్లిందని తెలుసుకొన్నారు. ఇక్కడ బుద్ధుని విగ్రహం, పురాతన శిల్పాల ప్రత్యేకతను.. ఏపీ వారసత్వ నగరాల సలహాదారు గల్లా అమరేశ్వరరావు అమెరికా రాయబారికి వివరించారు. అనంతరం రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కుటుంబంతో కలిసి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైదారాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా కూడా పాల్గొన్నారు.