ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు సోమువీర్రాజు, గత కొన్ని రోజులుగా, ఎలా రెచ్చిపోతున్నాడో చూస్తూనే ఉన్నాం... రెండు రోజుల క్రితం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై, తీవ్ర స్థాయిలో పర్సనల్ విమర్శలు కూడా చేసారు... ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులను చంద్రబాబు మాత్రం, సోము లాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు అంటూ వారించారు... ఇది ఇలా ఉండగానే, బీజేపీ నేత సోము వీర్రాజుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చీవాట్లు పెట్టినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే అధికారం నీకు ఎవరిచ్చారని... మిత్రధర్మం, పొత్తులపై ఎందుకు మాట్లాడుతున్నావ్? నోరు అదుపులో పెట్టుకోవాలని అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర చర్యలుంటాయాని అమిత్ షా హెచ్చరించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబుపై వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని అమిత్‌షా ఆదేశించినట్లు తెలుస్తోంది. సోమువీర్రాజుకు అమిత్‌షా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది.
అసలుకే ఆంధ్రప్రదేశ్ హామీల పై బీజేపీ - టిడిపి సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న వేళ, సోము వీర్రాజు లాంటి వాళ్ళు, మరింత గ్యాప్ పెంచి, తొందరగా జగన్ ను, బీజేపీ నీ కలిపెయ్యాలి అనే ఆత్రుతలో సోము వీర్రాజు ఉన్నట్టు అందరూ అనుకుంటూ ఉన్నారు... తాజగా అయితే షా, తనకు వార్నింగ్ ఇచ్చారని వస్తున్నఈ వార్తలపై సోము వీర్రాజు ఇంత వరకూ స్పందించలేదు..