గుజరాత్ ఎలక్షన్స్ గెలిచిన తరువాత నరేంద్ర మోడీ ఎలా ఫీల్ అయ్యారో కాని, ఇక్కడ మన రాష్ట్రంలో సోము వీర్రాజు అనే బీజేపీ నాయకుడు, ఎలా రెచ్చిపోయారో చూసాం. 2019లో మేమే ముఖ్యమంత్రి అభ్యర్ధిని నిర్ణయిస్తాం అంటూ, హడావిడి చేసారు. చంద్రబాబు అవినీతి చేస్తున్నారు అని, మేము తెలుగుదేశంతో వెళ్ళే అవసరం లేదు అని, ఇలా మామూలు హడావిడి చెయ్యలేదు... తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఉండదు అనే స్థాయిలో మాట్లాడారు... అయితే చంద్రబాబు మాత్రం, సోము వీర్రాజు వాగుడు పట్టించుకోవాల్సిన పని లేదు అని, ఆయనకు ఎవరూ రియాక్ట్ అవ్వద్దు అని అన్నారు. అయినా సోము వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేసారు.

somu 28122017 2

ఇది ఇలా ఉండగానే, రెండు రోజుల కృతం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, విషయం తెలుసుకుని, సోము వీర్రాజుకు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ వాయించి, నీ పరిధిలో నువ్వు ఉండు, నీ స్థాయి ఏంటో తెలుసుకుని అంతవరుకే మాట్లాడు, చంద్రబాబు లాంటి నమ్మకమైన మిత్రుడిని వదులుకోవటానికి మేము సిద్ధంగా లేము, మరో సారి నోరు జారితే పరిణామాలు వేరేలా ఉంటాయి, ముందు నష్ట నివారణ చర్యలు ప్రారంభించండి. మీడియాలో వివరణ ఇవ్వండి అంటూ, అమిత్ షా, వాయింపుతో సోము లైన్ లో పడ్డారు... కింద వీడియో చూడండి మీకే అర్ధమవుతుంది.

somu 28122017 3

"పొత్తులు అనేది మా పరిధిలో అంశం కాదు, మా అధ్యక్షులు ఎలా అంటే, అలా నడుచుకుంటాం...తెలుగు దేశం మా మిత్రపక్షం. రెండు పార్టీలు బలం పుంజుకుంటేనే ఇద్దరికీ మేలు జరుగుతుంది. నేను టీడీపీ కి,చంద్రబాబుకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా మాటలను వక్రీకరించారు . బీజేపీ ని బలోపేతం చేస్తాం. కేంద్ర నిధులతో 2019 కి పోలవరం పూర్తి చేస్తాం" అంటూ ఆయన మాటల తీవ్రత తగ్గించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ పరిణామం వెనకాల చాలా విషయం జరిగినట్టు సమాచారం... గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబుకి ఆహ్వానం పంపగా, పోలవరం మీద కేంద్రం వ్యవహిరిస్తున్న తీరుతో, అసంతృప్తి తెలియచేయటానికి చంద్రబాబు వెళ్ళకుండా, యనమల రామ కృష్ణుడుని పంపారు. ఆ సందర్బంలో యనమల, అమిత్ షా తో, సోము వీర్రాజు మాటల ప్రస్తావనకు తీసుకురాగా, అమిత్ షా సోము వ్యాఖ్యల పై మరింత సమాచారం తెప్పించుకుని, సోము వీర్రాజుకి ఫోన్ చేసి, హద్దుల్లో ఉండి మాట్లాడమన్నారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read