నిన్న ఢిల్లీలో, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావులతో కలిసి, రాష్ట్ర సమస్యల పై చర్చలు జరిగాయి. సుమారు ముప్పావుగంటపాటు సమాలోచనలు జరిపారు. అమిత్‌షాతో చర్చలు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్న 19 అంశాల గురించి రామ్మోహన్‌నాయుడు, కుటుంబరావులు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సిన 19 అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.
వీటి పై వెంకయ్య నాయుడు కూడా, కల్పించుకుని, ప్రతి అంశం పై క్లారిటీ అడుగుతూ ఉండటంతో, అమిత్ షా అసహనానికి గురైనట్టు సమాచారం... అందులోని చాలా అంశాలపై ఇప్పటికే ఫిబ్రవరి 9న రాజ్యసభలో ప్రకటన ద్వారా చెప్పామని అమిత్‌షా చెప్తూ, ఇప్పటికే రాష్ట్రానికి చాలా చేసామని, ఇక ప్రత్యేకంగా చెయ్యల్సింది ఏమి లేదని, మేము సిద్ధంగా లేమని, ఇంతటితో వదిలెయ్యండి అంటూ, వెంకయ్యతో అన్నట్టు వార్తలు వచ్చాయి. .ఆంధ్రాకు చేస్తే..ఇతర రాష్ట్రాలు కూడా సహాయాన్ని అడుగుతాయని..అందుకే తాము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని...తాము చేద్దామనుకున్నది.. ఇప్పటికే చెప్పామని..ఇంతకంటే..చేసేది లేదని..ఆయన తేల్చి చెప్పారట.
దీంతో ఇక బీజేపీకి, మన రాష్ట్రానికి ఏమి చేసే ఆలోచన ఏమి లేదు అనే విషయం అర్ధమైంది అని, టిడిపి ఎంపీలు అంటున్నారు.. ఈ చర్చలో జరిగిన అన్ని విషయాలు, అమిత్ షా స్పందన, ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరిస్తామని అన్నారు... వెంకయ్య స్థాయి వ్యక్తి సమావేశం పెడితే, ఎదో ఒక పరిష్కారం దొరుకుతుందని అనుకున్నాం, కాని అమిత్ షా ఆయన మాట కూడా లెక్క చెయ్యలేదు.. పైగా ఇక చేసేది ఏమి లేదు అని తేల్చి చెప్పేశారు.. చివరి ప్రయత్నం కూడా విఫలం అయినట్టే, ఇక పార్లమెంట్‌లోనే తేల్చుకోవాలనే దిశగా నిర్ణయం తీసుకుంటాం అంటూ, టిడిపి ఎంపీలు అంటున్నారు...
అమిత్‌షాతో సమావేశంలో తెదేపా నాయకులు ప్రధానంగా 19 అంశాల గురించే పట్టుబట్టారు. అందులో... 1. ప్రత్యేకహోదా 2. రెవిన్యూలోటు భర్తీ 3. పోలవరం ప్రాజెక్టు 4. రైల్వే జోన్ ఏర్పాటు 5. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు 6. అమరావతికి మరిన్ని నిధులు 7. జాతీయ విద్యాసంస్థల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తిచేయడానికి అవసరమైన నిధుల కేటాయింపు 8. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు 9. విభజన చట్టంలో ఉన్న పన్ను లోపాలను సరిదిద్దడం 10. కడపలో స్టీల్‌ప్లాంటుపై వెంటనే నిర్ణయం 11. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్ 12. విశాఖ, విజయవాడ మెట్రో 13. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలనుంచి అమరావతికి వేగవంతమైన రైలు, రోడ్డు నెట్‌వర్క్ ఏర్పాటు. 14. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కేబీకే తరహా ప్యాకేజీ 15. విద్యుత్తు డిస్కంలకు బకాయిల చెల్లింపు 16. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన అంశాలు ప్రధానమైనవి. ఇందులో కొన్నింటిపై రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.