కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది... బీజేపీ పార్టీ తరుపున, మైనింగ్ డాన్ గాలి జనార్దనరెడ్డి, ఎలక్షన్ ఫండింగ్ పుష్టిగా చేస్తున్నారు అనే ప్రచారం సాగుతుంది... అందుకే ఇదే ఊపులో, గాలి తన రాజకీయ పునఃప్రవేశానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆయన సోదరుడు జి.సోమశేఖర రెడ్డి ఇటీవల ప్రకటించారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తన అన్న జనార్దనరెడ్డి తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న చోట్ల భాజపా విజయానికి సహకరిస్తారని చెప్పారు... అమిత్ షా బళ్లారి పర్యటనలో కూడా, హడావిడి అంతా గాలి అనుచరులదే...

amit 02042018 2

అయితే, గాలి జనార్దనరెడ్డి, బీజేపీ తరుపున ఎమ్మల్యేగా పోటీ చేస్తున్నారని, వార్తలు రావటంతో, బీజేపీ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి... రెండున్నరేళ్ళు జైలులు ఉండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇస్తూ, అవినీతి పై పోరాటం అనే కధలు చెప్తున్నారని ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది... దీంతో నిఘా వర్గాల నివేదికలో కూడా ఇదే స్పష్టం అవ్వటంతో, అసలుకే మోసం వస్తుంది అని గ్రహించి, గాలి జనార్దనరెడ్డికి, భాజపాకు ఎలాంటి సంబంధం లేదని అమిత్‌షా ప్రకటించారు... బళ్లారి పరిసర జిల్లాల్లో మొత్తం 27 సీట్లు ఉన్నాయి... ఇక్కడ గాలి ప్రభావం ఎక్కువే... అయితే, లోపాయికారీ ఒప్పందంతో, ఈ ప్రకటన చేసి ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది...

amit 02042018 3

మరో పక్క, గాలికి, బీజేపీ ఇచ్చిన షాక్ తో, ఇక్కడ జగన్ కూడా ఉలిక్కి పడ్డాడు... జగన్, బీజేపీకి దగ్గర అవ్వటానికి, గాలి జనార్ధన్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు అనేది అందరికీ తెలిసిన విషయమే... ఇప్పుడు గాలిని, బీజేపీ వాడుకుని ఎలా వదిలేసిందో చూసిన తరువాత, జగన్ కు గుబులు పట్టుకుంది... గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ ఇద్దరూ ఒకే కోవలోకి చెందిన అవినీతి పక్షులు... ఇద్దరు రాజశేఖర్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయిన వారే... ఇప్పుడు జగన్ తో, మాంచి దోస్తీ చేస్తున్న బీజేపీ, తనని ఒక పావుగా వాడుకుంటుంది అని, టైం చూసుకుని గాలి జనార్ధన్ రెడ్డిని గెంటినట్టు, నన్ను కూడా గెంటుతుంది ఏమో, అని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.... ఏది ఏమైనా, బీజేపీ చెప్పినట్టి నడుచుకోవాల్సిన పరిస్థితి... పాపం జగన్.. ఫ్యూచర్, ఇప్పుడే కళ్ళ ముందు కనిపిస్తుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read