మొన్నటి దాక, కేంద్రంలో మీ మంత్రులని రాజీనామా చేపించండి... ప్రత్యేక హోదా ఇచ్చి తీరతారు చూడండి అని అన్నారు... కేంద్రంలో నుంచి బయటకు వచ్చారు, ఏమైంది ? ఎకౌంటులో వేసిన 350 కోట్లు కూడా వెనక్కు తీసుకున్నాడు మన ప్రధాని... అది అయిపోయిన తరువాత, మీరు ఇంకా ఎన్డీఏలోనే ఉంటే ఏమవుతుంది ? మోడీ మీద ఒత్తిడి తేవాలి అంటే, బయటకు రండి అన్నారు... బయటకు వచ్చారు, ఏమైంది ? అవిశ్వాసం పెట్టండి, నేను మద్దతు తీసుకువస్తా అని ఒకడు, నేను అవిశ్వాసం పెడుతున్నా మీరు మద్దతు ఇవ్వండి అని, ప్రధాని ఆఫీస్ లోనే కూర్చున్నాడు ఇంకొకడు... వీళ్ళ మాటలు వినకుండా, తెలుగుదేశమే సొంతగా అవిశ్వాసం పెట్టింది... ఒక్క గంటలో, దేశంలోని అన్ని విపక్షాలు చంద్రబాబుకి మద్దతు ఇచ్చాయి... కాని ఏమైంది ? పారిపోతున్నారు...

amit shah 30032018 2

అఖిలపక్షం పెట్టండి, అందరం కలిసి పోరాడదాం అని ఒకడు, తెలంగాణ తరహా పోరాటం అని ఇంకొకడు అన్నాడు... తీరా అవిశ్వాసం పెడితే, మోడీకి వ్యతిరేకంగా మేము రాము అని, ఇద్దరూ రాలేదు... ప్రతి దాంట్లో చంద్రబాబు, వీరి కంటే ఒక అడుగు ముందుకు వేసి, కేంద్రంతో పోరాడుతున్నారు... కాని వీరు మాత్రం అప్పుడు ఒకలా, ఇప్పుడు మరొకలా మాట్లాడుతున్నారు... వీరి ఇద్దరి చేత, చంద్రబాబుని అమరావతిలోనే కొట్టుకుంటూ చెయ్యాలని ఢిల్లీ పెద్దలు ప్లాన్ వేస్తే, చంద్రబాబు మాత్రం రాత్రికి రాత్రి, వీళ్ళు నా ముందు బచ్చాలు, నా యుద్ధం నీతోనే అని, వీరి ప్లాన్ తిప్పికొట్టి, సీన్ ఢిల్లీకి, ఆంధ్రాకి మధ్య అనే విషయం మరోసారి గుర్తు చేసి, అటు ఢిల్లీ పెద్దలు, ఇటు ఇక్కడ ఉన్న బచ్చాలకు జర్క్ ఇచ్చాడు చంద్రబాబు...

amit shah 30032018 3

ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఎంత ప్రయత్నం చేసినా, చంద్రబాబు ఎక్కడా దొరకటం లేదు... కేసుల్లో ఇరికిద్దాం అంటే, కేంద్ర సంస్థలే అన్నీ బాగున్నాయి అని రిపోర్ట్ లు ఇస్తున్నాయి.. అందుకే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేత మరో డ్రామాకు తెర లేపారు... మేము మా ఎంపీ సీట్లకు రాజీనామా చేస్తున్నాం, మీరు కూడా చెయ్యండి అంటూ తెలుగుదేశం పార్టీని రెచ్చగొడుతున్నారు... దీని వెనుక అమిత్ షా బుర్ర ఉన్నట్టు చెప్తున్నారు... ఎలాగైనా తెలుగుదేశం ఎంపీలను రెచ్చగొట్టి, వారిని రాజీనామా చేపించే బాధ్యత జగన్ మోహన్ రెడ్డికి అప్పచేప్పినట్టు తెలుస్తుంది... స్క్రిప్ట్ లో భాగంగా, పవన్ కూడా, తెలుగుదేశం ఎంపీలను రాజీనామా చెయ్యమంటారు...

amit shah 30032018

దీని వెనుక ఉన్న ప్రధాన కారణం, తెలుగుదేశం ఎంపీలు, పార్లమెంట్ లోపల రచ్చ రచ్చ చేస్తున్నారు... దేశం మొత్తానికి, మోడీ చేస్తున్న మోసం చెప్తున్నారు... మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, మోడీ పరువు తీస్తున్నారు... ఇంకా సంవత్సర కాలం ఉంది... తెలుగుదేశం ఎంపీలు, మోడీ, అమిత్ షా చేస్తున్న ద్రోహం అంతా సభ సాక్షిగా చీల్చి చెండాడుతారు.. అందుకే వీరిని రెచ్చగొట్టి రాజీనామా చేసే బాధ్యత వైసిపీకి అప్ప చెప్పారు అమిత్ షా... వీరు బయటకు వెళ్తే, ఎవరూ వీరిని పట్టించుకోరు... సభలో గొడవ చేస్తే అటన్షన్ వస్తుంది... అందుకే తెలుగుదేశం ఎంపీలను ఎలా అయినా రెచ్చగొట్టాలి, రాజీనామా చేసేలా చెయ్యాలి అనేది ప్లాన్... ఇక్కడ వింత ఏంటి అంటే, విజయసాయి రెడ్డి మాత్రం రాజీనామా చెయ్యడు అంట, మిగతా వారు చేస్తారు అంట... అసలు రాజీనామాలు చేసి ఏమి సాధిస్తారు ? ఇంకో సంవత్సరం పాటు ఎవరు పార్లిమెంట్ లో మన వాయిస్ వినిపిస్తారు, అంటే మాత్రం, ఒక్క వైసిపీ ఎంపీ సమాధానం చెప్పడు.. ఏ ప్రశ్న అడిగినా, తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చెయ్యాలి అనే డైలాగ్ ఒక్కటే చెప్తున్నారు... అందుకే ఇక రాబోయే వారం రోజులు, మనకు సాక్షి టీవీలో, హోదా గురించి కాని, విభజన హామీలు గురించి కాని, ఏ వార్త ఉండదు... తెలుగుదేశం ఎంపీలు రాజీనామా చెయ్యాలి అనే వార్తలతో ఒక క్యాంపైన్ నడవ బోతుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read