రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌, కంతేటి సత్యనారాయణరాజు, పార్టీ నేతలు సురేష్‌రెడ్డి, రవీంద్రరాజులకు అమిత్ షా, ఒక క్లిష్టమైన టాస్క్ ఇచ్చారు... వారం రోజుల టైం ఇచ్చి, చంద్రబాబు ఎమన్నా అవినీతి చేసేరేమో, ఎక్కడైనా దొరుకుతారేమో, అన్నీ వెతకండి, చిన్న ఆధారాం ఉన్నా చాలు, మిగతాది మేము చుకుంటాం అంటూ, ఎదో ఒకటి, ఒక వారం రోజుల లోపు తీసుకుని, ఢిల్లీ రావాలని ఆదేశించారు... అయితే, ఇప్పటికే అవి అన్నీ చూసాం అని, అన్నీ ఆన్లైన్ లో , రియల్ టైంలో ఉన్నాయని, ప్రతిది పక్కగా ఉంది అని, అందుకే రాయలసీమ డిక్లరేషన్ అని, లెక్కలు ఇవ్వలేదు అని ఎదురు దాడి తప్ప, చంద్రబాబు పై ఏ ఆరోపణ చెయ్యలేకపోతున్నామని మాజీ మంత్రి ఒకాయిన చెప్పారు.... అయినా, అమిత్ షా ఎదో ఒకటి ఉంటుంది, జాగ్రత్తగా చూడండి అని సమాధానం చెప్పినట్టు సమాచారం...

amitshah 18032018 3

తెలుగుదేశంపై దండయాత్ర మొదలుపెట్టాలని అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌ భాజపా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇకపై రాష్ట్రంలో భాజపా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అవసరమైతే, జగన్, పవన్ లతో కూడా కలిసి, చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి, వైఫల్యాలను ప్రజల ముందుంచాలని చెప్పారు. ఏపీకి కేంద్రం ఎన్ని వేల, లక్షల కోట్లు సాయం చేసిందో చెప్పి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ఆంధ్రప్రదేశ్‌పై భాజపాకున్న శ్రద్ధపై తీర్మానించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్దేశించారు. రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేయడానికి అమిత్‌షా రాష్ట్ర పార్టీ కోర్‌కమిటీని శనివారం దిల్లీకి పిలిపించి మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, జగన్ కు సలహాదారుడుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఇందులో పాల్గున్నారు.

amitshah 18032018 2

ప్రత్యేక హోదాపై వాళ్లు ఎలా భావోద్వేగాలు రెచ్చగెడుతున్నారో అలాగే మనం కూడా దానికి కౌంటర్ ఇవ్వాలి, దాని కోసం చంద్రబాబుని దోషిగా చూపించాలి అని అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు.. అమిత్‌షాతో సమావేశం అనంతరం ఏపీ భాజపా నేతలంతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చంద్రబాబు చేసిన తప్పులను వెతకాలని రామ్‌మాధవ్‌ రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలిసింది... దిల్లీ నుంచి కూడా తగిన ఆధారాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు సమాచారం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read