దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసిపోలేదు. ఇంకా మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ మిగిలే ఉంది. దాదాపు 169 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి దశలోనే భారతీయ జనతాపార్టీలో మెజారిటీపై అనుమానాలు నెలకొన్నాయి. హంగ్ వస్తే పరిస్థితేమిటనే దిశగా యోచిస్తున్నారు కమలనాథులు. అందుకే- అందరి కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. ఎన్డీయేతర పార్టీలను కలుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు మొదలెట్టేశారు కూడా. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం- దక్షిణాది రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్నారని భావిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంతనాలు ఆరంభించారు. ఈ మేరకు బీజేపీ సుప్రిమో అమిత్ షా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టచ్ లోకి వచ్చినట్లు చెబుతున్నారు.
అమిత్ షా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యా ఫోన్ సంభాషణ జరిగినట్టు జాతీయ మీడియాలో కధనాలు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల అనంతరం దేశంలో హంగ్ అంటూ వస్తే.. వైఎస్ జగన్ కింగ్ కు వచ్చే 4-5 సీట్ల కోసం అమిత్ షా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా,తెలుగుదేశం పార్టీ, కనీసం 18-20 సీట్ల వరకు గెలుస్తుందని విశ్లేషకులు చెప్తున్న సంగతి తెలిసిందే. హంగ్ ఏర్పడిన పరిస్థితుల్లో కనీసం జగన్ కు వచ్చే ఆ 4-5 ఎంపీ సీట్ల కోసం అమిత్ షా ఇప్పటి నుంచే బేరాలు మొదలు పెట్టారు. దీన్నంతటినీ విశ్లేషించుకున్న తరువాతే- కమలనాథులు వైఎస్ జగన్ వైపు దృష్టి సారించారని అంటున్నారు. అవసరం అయితే జగన్ కేసులను అడ్డం పెట్టుకుని బ్లాకుమెయిల్ చెయ్యటానికి కూడా వెనుకాడుట లేదు.
దేశంలో ఇంకా మూడు దశల ఎన్నికలు మిగిలి ఉన్న పరిస్థితుల్లో- మెజారిటీ స్థానాలు దక్కకపోవచ్చని బీజేపీ నాయకులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండో దశలో 169 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 6న 51, 12న 59, 19న మరో 59 సీట్లకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు దశల పోలింగ్ సరళి పార్టీకి అనుకూలంగా ఉండకపోవచ్చంటూ బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు చెప్పుకోవచ్చు. జగన్ మద్దతు కోసం, వైఎస్ఆర్సీపీ నాయకులపై ఉన్న ఆర్థిక నేరాలను కూడా బూచిగా చూపించడానికి అవకాశం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నరసాపురం లోక్ సభ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు సుమారు 976 కోట్ల రూపాయల మేర బ్యాంకు డిఫాల్టర్ గా ఉన్నారని, ఆయనపై జరిగిన దాడులు, ఈ బెదిరింపులలో భాగం అని తెలుస్తుంది.