బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఏపీ సీఎం చంద్రబాబు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలు నేరవేర్చాలని అడిగితే ఎదురుదాడి చేయడం ఏంటని, ఇది ఎంత దుర్మార్గమని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అమిత్ సా తనయుడు ఆస్తులు 16వేల రెట్లు పెరిగితే దర్యాప్తు జరపరా? అని చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. పలాసలో మాదిరిగా భవిష్యత్తులో బీజేపీ సభలకు ఎవరు హాజరుకారని సీఎం అన్నారు. విభన అంశాల్లో 10 పూర్తి చేశామని చెప్పాడాన్ని ఆయన తప్పు పట్టారు. బీజేపీది బస్మాసుర హస్తమని ఎద్దేవా చేశారు. న్యాయం చేయమని అడిగితే టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీలతో దాడులు చేయించారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

shah 05022019 2

అమిత్‌షా కొడుకు ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. తన ఆస్తులు అంత పెరగలేదని, ప్రతి ఏడాది తన ఆస్తులపై నివేదిక ఇస్తున్నామని అన్నారు. ఇవాళ అమిత్ షా దేశమంతా తిరిగి నీతి వ్యాఖ్యాలు చెబితే తాము వినాలా? అని సీఎం ప్రశ్నించారు. నిన్న పలాసలో ఏం జరిగిందో.. భవిష్యత్‌లో బీజేపీ సభలకు ఎవరూ రారని ఆయన జోస్యం చెప్పారు. అమిత్ కో-ఆపరేటివ్ బ్యాంక్, విజయ్ మాల్యా, నీరవ్ వీరంతా రూ. 4వేల కోట్లు దోచుకునిపోతే.. వారిని వదిలేసి.. తనపై ఆరోపణలు చేస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. నిజం నిప్పులాంటిదని, ఆ విషయం బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఏపీకి కేంద్రం రూ. 2 లక్షల 44వేల కోట్లు ఇచ్చిందన్న బీజేపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. హైవేలు ఏపీకి ఎన్ని ఇచ్చారో.. గుజరాత్‌కు ఎన్ని ఇచ్చారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. తాను యూటర్న్ తీసుకోలేదని, తనది రైట్ టర్న్ అని.. బీజేపీదే వంకరటింకర టర్నింగ్ అని కౌంటరిచ్చారు. పుత్రవాచ్ఛల్యంతో అవినీతికి పాలపడిన తన కొడుపై చర్యలు తీసుకోని అమిత్ షా.. తనను విమర్శించే అర్హత లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆపేది లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

shah 05022019 3

‘ప్రజలే బీజేపీకి డోర్లు మూసే పరిస్థితి వస్తుంది. ఎన్డీఏలో చేరతామని షాను అడుక్కునే వాళ్లు ఇక్కడెవరూ లేరు. 2014లో ఎవరు ఎవరిని అడుక్కున్నారో ఆయన గుర్తు చేసుకోవాలి. చెప్పిన మాట నిలబెట్టుకోకుండా బీజేపీ నమ్మక ద్రోహం చేసింది. నాలుగేళ్ల క్రితం ఆయనెక్కడున్నారు? ఆయన చరిత్ర ఏంటి..? ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. సరైన సమయంలో చెబుతా. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే వినడానికి తెలుగు జాతి సిద్ధంగా లేదు. బీజేపీ రాష్ట్రానికి ఏంచేసిందో ప్రజలు నిలదీస్తున్నారు. దానికి సమాధానం చెప్పకుండా అది చేశాం.. ఇది చేశామని దాడి చేస్తే ఎవరూ భయపడరు. అవినీతి పార్టీ గెలిచి తమను కాపాడుతుందని షా అనుకుంటున్నారు. ఆ అవినీతి పార్టీతోనే ఉండండి. మాకేమీ బాధ లేదు. తితలీ తుఫానుకు శ్రీకాకుళం విధ్వంసమైతే అమిత్‌షా పరామర్శకు కూడా రాలేదు. 4 నెలల తర్వాత వచ్చి ఏం చూద్దామని, ఏం చేద్దామని? ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడొస్తున్నారు. ప్రజల నిరసనల తీవ్రతను మోదీ, షా ఎదుర్కోక తప్పద’’ని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read