దేశ చరిత్రలోనే అతి దరిద్రమైన ఆట, కర్ణాటకలో ఆడింది బీజేపీ. కబురులు చెప్పే మోడీ, అమిత్ షా ఆడిన ఆట ఇంకా అందరికీ గుర్తుంది. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడిని చేరదీసి, పక్కన పెట్టుకుని, నిస్సిగ్గుగా ప్రచారం చేసారు... మెజారిటీ రాకపోయినా, గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు... చివరకు 150 కోట్లు ఆఫర్ చేసారు... ఆడియో టేప్ లు బయటపడ్డాయి. అర్ధరాత్రి సుప్రీం కోర్ట్ తలుపులు తెరుచుకున్నాయి.. దేశంలో ఎంత దౌర్భాగ్యం లేకపోతే, అర్ధరాత్రి తలుపులు తెరుచుకుంటాయి ? అమిత్ షా, మోడీ కుట్రలని తిప్పి కొడుతూ, సుప్రీం కోర్ట్ ఒక్క రోజే బల నిరూపణకు టైం ఇచ్చింది... దీంతో బేర సరాలకు టైం సరిపోలేదు... చివరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు ఉన్న బీఎస్ యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. అమిత్ షా, మోడీ కుట్రలని తట్టుకుని, దేశం గెలిచింది... అప్పటి నుంచి కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

amitshah 15012019 2

అయితే, అప్పటి నుంచి బీజేపీ, ఎప్పుడెప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని పడేద్దామా అని ప్లాన్లు వేస్తూ వస్తుంది. తాజాగా, కర్ణాటకలో మరోసారి రిసార్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. కూటమి సర్కార్‌ను కూలదోసేందుకు తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, బేజీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. సొంత పార్టీకి చెంది 102 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గురుగావ్ తరలించింది. అక్కడి ఫైస్ స్టార్ హోటల్‌లో వారిని ఉంచినట్టు తెలుస్తోంది. మరోవైపు, తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ముంబైకి తరలించిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

amitshah 15012019 3

అమిత్ షా డైరెక్ట్ గా రంగంలోకి దిగి, ఒక్కో ఎమ్మెల్యేకి 30 కోట్లు ఆఫర్ చేసినట్టు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు తమతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారంటూ ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలతో కర్ణాటక రాజకీయాల్లో అయోమయం నెలకొంది. బీజేపీకి చెందిన 4 నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ మీడియాకు తెలిపారు. కాగా, కాంగ్రెస్ నుంచి 10 మంది, జేడీఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ క్లెయిమ్ చేస్తోంది. మీరు బేరసారాలు జరుపుతున్నారంటే మీరు బేరసారాలు జరుపుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు గుప్పించుకోవడంతో రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది. ప్రశాంతంగా సాగుతున్న కర్ణాటకలో, బీజేపీ చిచ్చు పెట్టి, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అనిశ్చితికి కారణం అయ్యింది. తనకు అనుకూలంగా ఉన్న కేసీఆర్ మినహా, దక్షిణ భారత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, బీజేపీ ఇదే ఆట ఆడుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read