నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యల పై, మహానాడు వేదికగా, చంద్రబాబు ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. నీ స్థాయి ఏంటి ? నువ్వు ఏమన్నా ప్రదానివా ? ఒక పార్టీ ప్రెసిడెంట్ వచ్చి, ఒక ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమాధానం చెప్తామా ? ప్రధాని అడగాలి, కేంద్రం అడగాలి, నువ్వు ఎవరు అంటూ అమిత్ షా పై చంద్రబాబు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం అమిత్ షా వరకు వెళ్ళటంతో, చంద్రబాబు రియాక్షన్ విని, చంద్రబాబు అంత మాటన్నారా అంటూ, అమిత్ షా అన్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు ఇంత దూకుడుగా మాట్లడతారని అనుకోలేదు, నేను వాళ్ళని లెక్కలు అడగలేదు, ఒక రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ గా ప్రశ్నించాను అని కొంత మంది నాయకుల వద్ద అన్నట్టు తెలుస్తుంది. మహానాడు మొదలైన దగ్గర నుంచి, అక్కడ వస్తున్న విమర్శల పై ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని, అమిత్ షా ఇప్పటికే బీజేపీ పార్టీకి ఆదేశించారు.
దీంట్లో భాగంగా, చంద్రబాబు మొదటి రోజు చేసిన విమర్శలకు, తానే ప్రధాని అన్నట్టు, తానే ప్రభుత్వం అన్నట్టు, లెక్కలు ఇవ్వండి, ucలు ఇవ్వండి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు... ‘‘ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టని రాజధానికి నిధులు ఎలా ఇస్తాం? అమరావతి డిజైన్లు ఇంకా సింగపూర్ వద్దే ఉన్నాయి. ఇచ్చిన నిధులకు యూసీలూ ఇవ్వలేదు’’ అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన ఆరోపణలపై చంద్రబాబు మండిపడ్డారు. సోమవారం మహానాడు వేదిక నుంచి అమిత్‌షాకు కౌంటర్ ఇచ్చారు. ‘‘రాష్ట్రానికీ, రాజధానికీ నిధులు ఇవ్వకున్నా ఇచ్చామనడం దుర్మార్గం. అమరావతికి ఇచ్చిన నిధులకు యూసీలు పంపినా పంపలేదనడం మరింత దుర్మార్గం’’ అని అన్నారు. అసలు యూసీల గురించి మాట్లాడేందుకు అమిత్ షా ఎవరని ప్రశ్నించారు.
‘‘బీజేపీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పాలనలో జోక్యం చేసుకోవడం ఏంటి? ఏదైనా ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రులు చెప్పాలి. అమరావతికి ఇచ్చింది రూ.1500 కోట్లు. రూ.1509కోట్ల మేర యుటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపాం. ఆ యూసీలు పరిశీలించి.. తదుపరి నిధులు విడుదల చేయాలని నీతి ఆయోగ్ కూడా చెప్పింది. ఇప్పుడు మళ్లీ యూసీలు ఇవ్వడం లేదని షా అనడం సరికాదు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఏ విమర్శ చేసినా, చంద్రబాబు డాక్యుమెంట్ లు, వీడియోలు చూపించి మరీ, బీజేపీ ఆడుతున్న అబద్ధాలు తిప్పి కొడుతున్నారు. చంద్రబాబు దూకుడికి, రాష్ట్ర బీజేపీ నేతలు చేతులు ఎత్తేయటంతో, అమిత్ షా డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. అయితే, అమిత్ షా ని కూడా చంద్రబాబు వాయించారు. దీంతో అమిత్ షా నొచ్చుకున్నట్టు తెలుస్తుంది.