అటు పార్లమెంట్‌, ఇటు రాజ్యసభలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీల పై బీజేపీ టార్గెట్ పెట్టిందని, వారిని తమ పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉందని ఢిల్లీ పొలిటకల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో బీజేపీ పార్టీ మైనారిటీలో ఉంది. దీంతో, ఈ సభలో టీడీపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారని గ్రహించి, వారి పై ఫోకస్ పెట్టారు. వారిని తమ పార్టీలో కలుపుకొని, తమకు తగ్గిన తమ బలాన్ని కొంత మేరకు అయిన భర్తీ చేసుకొనే విధంగా ప్లాన్ వేసారు. ఇందు కోసం టిడిపి రాజ్యసభ సభ్యులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్‌, గరికపాటి మోహన్‌రావు, తోటసీతారామలక్ష్మి, టీజీ వెంకటేశ్‌, కనకమేడల పై బీజేపీ నేతలు కన్ను వేసినట్లు ఢిల్లీ నుంచి వస్తున్న విశ్వసనీయవర్గాల సమాచారం. వీరిలో కొంత మందితో, ఇప్పటికే పరోక్షంగా మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే లోక్‌సభకు టీడీపీ నుంచి ముగ్గురు ఎంపీలుగా ఎన్నిక కాగా, వారిలో ఎవరెవరు తమ పార్టీలోకి చేరతారన్న విషయం పై కూడా బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే, పార్లమెంట్‌ భవనంలో ఉన్న టీడీపీ పార్లమెంటరీ కార్యాలయాన్ని వేరే పార్టీలకు కేటాయించే విషయం పై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పార్లమెంటరీ సెక్రటేరియట్‌ అధికారి ఒకరు టిడిపి నేతలకు ఫోన్‌ చేసి, మీకు అంత పెద్ద గది ఎందుకు ?అని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీపీ ఆఫీస్, లైబ్రరీకి వెళ్లే దారిలో నంబర్‌ 5 గది టీడీపీపీ కార్యాలయంగా ఉంది. ఇది వరకు, సుమిత్రా మహాజన్‌ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడే ఈ గదిని అన్నాడీఎంకేకి కేటాయించాలని నిర్ణయించారు. అయితే ఈ గదితో తెలుగుదేశం పార్టీకి ఎంతో అవినాభావ సంబంధం ఉందని అప్పట్లో తెలుగుదేశం వాదించడంతో, సుమిత్రా మహాజన్‌ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు టిడిపి నుంచి ముగ్గురు ఎంపీలే ఎన్నిక కావడంతో, తిరిగి ఈ అంశం తెర పైకి వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read