వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతి పేరు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ చార్జిషీటులో చేర్చిందన్న వార్తలు ఆ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్రపతి ఎన్నిక నుంచి ఇప్పటివరకూ తాము బీజేపీకి అన్ని విధాలా సహకరిస్తున్నప్పటికీ, కేంద్రం ఇలాంటి బెదిరింపు ధోరణికి దిగడం పై పార్టీ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీతో బంధం భవిష్యత్తులో ప్రమాదకరేమనన్న వ్యాఖ్యలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా ఈడీ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్ల, వైసీపీని పూర్తి స్థాయిలో దారికి తెచ్చుకునే హెచ్చరిక సంకేతాలున్నట్లు చర్చ జరుగుతోంది.

 style=

రెండు వారాల క్రితం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో, జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఒక ఎంపి చర్చించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ వంద సీట్లకు పోటీ చేస్తే, మిగిలిన 75 సీట్లలో తాము, జనసేన పోటీ చేస్తామని బీజేపీ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ ప్రతిపాదనను జగన్ సున్నితంగా తిరస్కరించి, దానివల్ల అంతా మునిగిపోతామని, ముఖ్యంగా తన పార్టీ దెబ్బతింటుందని, తన లక్ష్యం నెరవేరదని దూత పాత్ర పోషిస్తున్న సదరు ఎంపీకి స్పష్టం చేశారు.

amitshah 11082018 2

దానికి బదులు వైసీపీ నష్టపోని ప్రతిపాదన రూపొందించాలని సూచించారు. అదే విషయాన్ని సదరు ఎంపీ బీజేపీ నాయకత్వానికి స్పష్టం చేశారు. తమ ప్రతిపాదనను జగన్ తిరస్కరించడం పై బీజేపీ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం
చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీకి ఎలాంటి బలం లేనందుకే ఎవరూ ఖాతరు చేయడం లేదని, తమను కాదని వెళ్లిపోయిన టీడీపీకి ఇప్పటికే ప్రభుత్వపరంగా, చుక్కలు చూపిస్తున్న బీజేపీ.. తన ప్రతిపాదనను తిరస్కరించిన వైసీపీకీ ఒక హెచ్చరిక సంకేతం పంపాలన్న భావనతో ఉన్నట్లు.. గత వారం నుంచే చర్చ జరుగుతోంది.

amitshah 11082018 3

చివరకు అది ఈడీ రూపంలో ఉంటుందని మీడియా కథనాలతో స్పష్టమయింది. బీజేపీ ప్రతిపాదనను కాదన్నందుకే ఈ పరిణామాలు జరుగుతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కాగా ఈడీ నిర్ణయం మీడియాలో వెలువడిన నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నిక నుంచి, తాజా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు దూరం ఉండి సహకరిస్తున్నా.. బీజేపీ తన సహజ శైలిని విడనాడకపోవడం పై వైసీపీ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. జాతీయ పార్టీల చట్రంలో ఉంటే ఇలాంటి బెదిరింపులు తప్పవన్న అనుభవం, గతంలో ఒకసారి కాంగ్రెస్ ద్వారా స్పష్టమయిందని గుర్తుచేస్తున్నారు.

amitshah 11082018 4

ఇప్పుడు బీజేపీ కూడా కేసులు అడ్డు పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్న వైనం.. జాతీయ పార్టీల బాహుబంధనాల్లో చిక్కుకోవడం మంచిదికాదన్న విషయాన్ని స్పష్టం చేస్తోందని విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన సహా.. తొలుత ఎవరైతే మిత్రులుగా ఉన్నారో, వారినే తొక్కేసి సొంతగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న బీజేపీ వ్యూహాన్ని అర్ధం చేసుకోవడంలో తమ నాయకత్వం వైఫల్యం చెందిందని అంగీకరిస్తు న్నారు. టీడీపీని బీజేపీ నుంచి వేరు చేసేందుకే కృషి చేసినప్పటికీ, దానివల్ల తమకు కలిగే ఉపశమనం లేకపోగా పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలను దూరం చేసుకో వలసి వచ్చిందని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికయినా జాతీయ పార్టీలపై ఆధారపడకుండా, సొంత నిర్ణయాలు తీసుకుంటేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సోర్స్: సూర్య పత్రిక

Advertisements

Advertisements

Latest Articles

Most Read