జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ రెండున్నరెళ్ళలో అన్నీ ప్రజలను ఇబ్బంది పెట్టే పనులే చేస్తూ వచ్చింది. ప్రజలు కూడా విసిగి వేసారి ఉన్నారు. అభివృద్ధి అనే మాటే లేదు. అయితే సంక్షేమం చేస్తున్నాం అంటూ ఊదరగొడుతున్నా, అది నామమాత్రం అనే చెప్పాలి. హడావిడి తప్ప విషయం లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం, జగన్ ప్రభుత్వం పై సానుకూలత ఉంది. అదే అమ్మ ఒడి పధకం. గతంలో ఇచ్చే అనేక పధకాలు ఆపేసి, ఆ డబ్బు మొత్తం ఒకేసారి ఇస్తూ ఉండటంతో ప్రజలు కూడా ఈ పధకానికి కనెక్ట్ అయ్యారు. గత రెండేళ్లుగా సంక్రాంతి పండుగ రోజున ఈ పధకం ఇస్తారు. దీంతో ప్రజలు కూడా, ఈ డబ్బు తీసుకుని స్కూలు ఫీజులు కట్టటం, సొంత అవసరాలకు ఉపయోగించుకోవటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు ఈ పధకాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా జగన్ చేసిన సమీక్షలో అమ్మఒడి పధకం పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి అమ్మఒడి జనవరి నెలలో కాకుండా, జూన్ నెలలో ఇస్తాం అంటూ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెనుక ప్రభుత్వ ఆర్ధిక కష్టాలు ఉన్నయనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉండటంతో, ప్రస్తుతం జీతాలకు కూడా డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి.
ఈ పరిస్థితిలో ఒకేసారి ఆరు వేల అయుదు వందల కోట్లు కావాలి అంటే, అంత అప్పు పుట్టటం అనేది అసంభవం. అందుకే దీన్ని ప్రస్తుతానికి ఆరు నెలల పాటు వాయిదా వేసి, గండం గట్టెక్కించే ప్లాన్ వేసారు. అయితే మొదటి నుంచి అమ్మ ఒడి పై ప్రభుత్వం నాటకాలు ఆడుతూ వస్తుంది. ముందుగా ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి అని చెప్పారు. తరువాత కాదు కాదు అంటూ ఒక్కరికే పధకం అని చెప్పారు. సరే ఇది అయిపోయిన తరువాత పదిహేను వేలు కాదు అంటూ, ఒక వెయ్యి కట్ చేసి, కేవలం 14 వేలు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా 75శాతం హాజరు ఉండాలని మరో మెలిక పెట్టారు. అయితే ఈ రెండేళ్ళు క-రో-నా కావటంతో, ఈ నిబంధన వర్తించలేదు. ఇప్పుడు ఏకంగా పధకమే ప్రశ్నార్ధకం చేసారు. అయితే ఈ ఇంపాక్ట్ ప్రైవేటు స్కూల్స్ మీద పడనుంది. సకాలంలో ఫీజులు వస్తాయో రావో అనే పరిస్థితి వచ్హిది. మొత్తానికి, మొన్నటి వరకు ఎక్కడైతే జగన్ కు పాజిటివ్ ఉందో, అది కూడా నెగటివ్ అయి కూర్చుంది. అభివృద్ధి అయితే ప్రజలకు పట్టదు కానీ, తమకు వచ్చే పధకాలు ఇవ్వకపోతే మాత్రం, ఊరుకోరు మరి.