పోయిన ఏడాది అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్ల మెంట్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా "అమ్మకు వందనం' కార్యక్రమాన్ని రేపు (జనవరి 22) రాష్ట్ర ప్రభుత్వం జరపనుంది... అమ్మను గౌరవించిన వారే మన కుటుంబ వ్యవస్థ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు... కుటుంబ వ్యవస్థకు పునాది అయిన అమ్మను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిల్లలకు చిన్నతనంలోనే బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. నే టితరానికి ముఖ్యంగా పాఠశాల విద్యారులను ఉద్దేశించిన కార్యక్రమం 'అమ్మకు వందనం..
పాఠశాలలకు తల్లిని గౌరవంగా తీసుకువచ్చి ఆమె కాళ్లు కడిగించడం అంటే బిడ్డలకు తల్లిని గౌరవించే సంస్కతిని బోధించడమే ఈ కార్యక్రమ విశేషం. చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టిన రోజు వసంత పంచమిని పరస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని ఈ నెల 22న ప్రారంభిస్తున్నారు. విద్యార్దుల తల్లిదండ్రులను ఆ రోజున పాఠశాలలకు ఆహ్వానించి విద్యార్ధులకు ఆశీర్వాదం అందజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జిరాష్ట్రంలోని 5వేల ఉన్నత పాఠశాలల్లోల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు గాను ఒక్కో పాఠశాలకు రూ.2500 చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది.
సంక్రాంతి సెలవలు అనంతరం పాఠశాలలు ఈ నెల 22న పునఃప్రారంభమవుతున్నాయి. అదే రోజు వసంత పంచమిని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జడ్పీ, మున్సిపల్ పాఠశాలలు మోడల్ స్కూల్స్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని స్కూల్స్ కి నిధులను ప్రభుత్వం విడుదల చేశారు. అలాగే ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక ప్రతిజ్ఞను రూపొందించారు. వివధ పాఠశాలలకు చెందిన దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు, ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా ఏర్పాట్ల చేస్తున్నారు.