నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రముఖ యూనివర్సిటీ రానుంది. ప్రతిష్టాత్మిక అమృత యూనివర్సిటీ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. అమృత విశ్వవిద్యా లయం బిల్డింగ్ ప్లాన్‌కు సీఆర్డీయే ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారు.
విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఆ యూనివర్సిటీ ప్రతినిధులు తమ అమరావతి క్యాంపస్‌కు సంబంధించిన ప్లాన్‌తో కూడిన దరఖాస్తును సమర్పించగా, అవి నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి పత్రాన్ని సీఆర్డీయే మంజూరు చేసింది.
నిన్న సీఆర్డీయే కార్యక్రమంలో ఓపెన్ ఫోరంలో మొత్తం 22 దరఖాస్తులు అందగా, వాటిల్లో నిబంధనలను పాటించిన 15కు అధికారులు అనుమతులిచ్చారు. మరో 4 దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం కోరారు. మిగిలిన మూడింటిని తిరస్కరించారు.
Advertisements