దేశాన్ని ఏలుతున్న ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు, ఒక రాజ్యసభ సభ్యుడు.. ఎంత జాగ్రత్తగా, బాధ్యతగా మాట్లాడాలి.. కాని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఇవేమీ పట్టవు, అడ్డగోలుగా రెచ్చిపోండి అని చెప్తున్నారు.. ఏ సోషల్ మీడియా వల్ల, తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారో, అదే సోషల్ మీడియాలో, ఈ సారి కూడా మరిన్ని తప్పుడు ప్రచారాలు చేసి, అధికారం నిలబెట్టుకోవాలని, పార్టీ వాళ్లకి పిలుపు ఇస్తున్నారు. సోషల్ మీడియా సాయంతోనే గత ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చామని, అబద్ధాలైనా సరే ప్రచారం చేయండని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఆ పార్టీ సోషల్మీడియా శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. రాజస్థాన్లోని కోటలో బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'వాస్తవమో, అబద్ధమో.. ఏదైనా సరే ప్రచారం చేయండి. అందులో మంచీ, చెడు ఎంత ఉందో చూడొద్దు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేయండి' అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'గతంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, తన తండ్రి ములాయం సింగ్ను కొట్టినట్టు బీజేపీ కార్యకర్త ఒకరు పోస్ట్ చేశారు. కొద్ది సమయంలోనే ఇది వైరలయ్యింది. నేను కూడా ఆ పోస్ట్ చూశాను. తరువాత అది నకిలీ పోస్ట్ అని తేలింది. అయినా, ఈ పనిని మీరు మానకండి. యూపీలోని సోషల్ మీడియా వాలంటీర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అందులో 32 లక్షల మంది సభ్యులున్నారు. ప్రతీ ఉదయాన్నే వారికి సందేశాలు అందుతాయి' అని కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సోషల్ మీడియాలో వైరలవుతున్న సమాచారానికి అడ్డుకట్ట వేయాలని కోర్టులు ఆదేశాలు జారీ చేస్తుంటే మరోవైపు అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరో వైపు, అమిత్ షా వ్యాఖ్యల పై వివిధ పార్టీలు వారి భగ్గు మంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారం మితిమీరిందని, ఇప్పుడు అమిత్ షా నే, ఇలా పిలుపు ఇస్తుంటే, ఇక బీజేపీ కార్యకర్తలకు అడ్డు అదుపూ ఉండదని, ఒక బాధ్యత గల వ్యక్తి ఇలా చెప్పటం ఏంటి అని మండి పడుతున్నారు. ఇప్పటికే రాఫెల్ లాంటి కుంబకోణాల్లో, అబద్ధాలు చెప్పి బ్రతికేస్తున్నారని, ఎద్దేవా చేస్తున్నారు.