తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్న సమయంలోనే, సీనియర్ నేత, మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే ఆనం చేసిన వ్యాఖ్యలు, వైసీపీని ఇరకాటంలో పడేశాయి. వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఆనం ఈ రోజు పాల్గుని, అక్కడ తన ఆవేదన మొత్తం కక్కేశారు. వాలంటీరు వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు, అంతకు మించి చేస్తున్నది ఏంటి ? రోడ్లుకు కనీసం గుంటలు పూడ్చామా ? తాగటానికి నీళ్ళు ఇచ్చామా ? అసలు ఈ నాలుగు ఏళ్ళలో మనం ఏమి చేసాం ? ప్రజలను రేపు ఏమని ఓట్లు అడుగుదాం ? ఎన్నికల సమయంలో ఎస్ఎస్ కెనాల్ కడతామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచాం, గెలిచిన తరువాత ఏమి చేసాం ? పెన్షన్లు మనం కాదు కదా, గతంలో తెలుగుదేశం కూడా ఇచ్చిందని అన్నారు. వైఎస్ఆర్ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మన ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రజలు నన్ను కూడా నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. గ్రామాల్లో కనీసం బిందెడు నీళ్ళు ఇవ్వలేక పోయామని అన్నారు. పెన్షన్లు ఇస్తేనే ఓట్లు వేసేస్తారా అని ప్రశ్నించారు. ఆనం వ్యాఖ్యలతో వైసీపీ ఒక్కసారిగా ఖంగుతింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read