ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాక, పక్క రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు నెల్లూరు కృష్ణపట్నం ఆ-నం-ద-య్య మం-దు పై ఆలోచనలో పడ్డారు. ఒక పక్క క-రో-నా తో ప్రజలు అల్లాడి పోతూ ఉన్న సమయంలో, ఆక్సిజన్ లేక, బెడ్స్ లేక, ఇలా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో, ఆనందయ్య మందు పై ప్రచారం మొదలు అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి ఈ మందు ఇస్తున్నా, నెల్లూరులో తప్ప, చుట్టు పక్కల గ్రామాలకు ఇది విస్తరించలేదు. అయితే గత 20 రోజుల క్రితం, ఈ మం-దు పై విపరీతమైన ప్రచారం జరిగింది. ఫలితాలు కూడా వస్తూ ఉండటం, ఎలాంటి హాని లేకుండా ఉండటంతో, ప్రజలు కూడా దీని పై ఆసక్తి చూపించారు. తరువాత ప్రభుత్వం ఎంటర్ అవ్వటం, ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళటం, మం-దు పంపిణీ ఆగిపోవటం, హైకోర్టుకు ఈ విషయ చేరటం, కేంద్ర ప్రభుత్వం కూడా దీని పై పరిశోధనలు జరపటం, ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడెప్పుడు ఆయన మం-దు కు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా, దీని పై ఎప్పుడు నివేదికలు వస్తాయి, ఎప్పుడు దీనికి అనుమతులు వస్తాయి, ఇలా ప్రజలు దీని కోసం ఎదురు చూస్తూ ఉండటంతో, ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ లోనే కాక, ఇతర రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతుంది.

trs 28052021 2

ఈ నేపధ్యంలోనే ఆ-నం-ద-య్య మం-దు పై, పక్క రాష్ట్రం తెలంగాణాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా, ఈ విషయం పై స్పందిస్తున్నారు. జగిత్యాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆ-నం-ద-య్య మం-దు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ-నం-ద-య్య మం-దు కళ్ళల్లో వేస్తున్నారని, కళ్ళల్లో వేస్తె ఆ మందుతో కళ్ళకు ప్రమాదం అని అన్నారు. ఆ మందు వేసుకుంటే, కళ్ళ మంట తప్ప, క-రో-నా పోదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక వేళ అలా కాకుండా, ఆ మందు నిజం అని, దాని వల్ల క-రో-నా పోతుంది అంటే, పాదాభివందనం చేస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రజలు మూఢనమ్మకాలకు పోకుండా, జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆ మం-దు పై వ్యాఖ్యానించారు. అయితే అసలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయం పై, ఎక్కడో తెలంగాణాలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు ఇలా నెగటివ్ గా స్పందించారు అనేది తెలియాల్సి ఉంది. ప్రజలు నమ్ముతున్నప్పుడు, దాని వాళ్ళ ఎలాంటి హా-ని లేనప్పుడు, ఎందుకు ఇలా స్పందించారో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read