తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద, నిన్న ఆర్దరాత్రి హైడ్రామా నెలకొంది. ఈ ప్రభుత్వంతో పాటుగా, పోలీసులు ఎలా పని చేస్తున్నారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు. రెండు రోజుల క్రిందట, నర్సీపట్నంలోని ఏజెన్సీ ప్రాంతంలో, గంజాయి సాగు చేస్తున్న స్థావరాల పై నల్గొండ పోలీసులు వచ్చి రైడ్ చేసారు. ఈ ఘటనలో గంజాయి బ్యాచ్ ఎదురు తిరగటంతో, పోలీసులు పది రౌండ్లు కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో కొంత మంది గిరిజనులకు కూడా గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటన పై నిన్న మధ్యానం 12 గంటల సమయంలో టిడిపి నేత నక్కా ఆనంద బాబు, మీడియా సమావేశం పెట్టి, రాష్ట్రంలో విచ్చలవిడిగా రవాణా అవుతున్న గంజాయి పై ప్రెస్ మీట్ పెట్టి, కొన్ని ఆరోపణలు చేసారు. ఎక్కడ చూసినా గంజాయి సాగుతో పాటుగా, ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా అవుతుందని, పక్క జిల్లా పోలీసులు వచ్చి సోదాలు చేసే దాకా, మన పోలీసులు ఏమి చేస్తున్నారని ? వైసిపి నాయకుల అండతోనే, గంజాయి బ్యాచ్ రాష్ట్రంలో రెచ్చిపోతుంది అంటూ ఆరోపణలు చేసారు. అంతే, ఈ ప్రెస్ మీట్ పై, నర్సీపట్నం పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నిన్న మధ్యానం 12 గంటలకు ప్రెస్ మీట్ పెడితే, నిన్న రాత్రి 11 గంటల కల్లా గుంటూరు చేరుకున్నారు.

anandababu 19102021 2

నర్సీపట్నం నుంచి కనీసం ఏడు గంటలకు పైగా సమయం పడుతుంది. ప్రెస్ మీట్ అయిన గంటకు బయలుదేరితే కానీ రాత్రికి గుంటూరు చేరుకోరు. అలాంటిది పోలీసులు హుటాహుటిన బయలుదేరి, నర్సీపట్నం నుంచి గుంటూరు వచ్చారు. అర్ధరాత్రి సమయంలో నక్కాఆనందబాబు ఇంటికి చేరుకుని, ఆయనను పిలిచి, తమకు గంజాయి పై స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు. మీరు ఏ ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు, వైసిపి నాయకులు ఎవరు, ఆ పేర్లు చెప్తే, తాము స్టేట్మెంట్ రాసుకుంటాం అంటూ పోలీసులు వచ్చి కూర్చుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో, ఏదో పెద్ద కేసు అయినట్టు, ఇలా చేయటం పై, నక్కా ఆనందబాబు తీవ్ర అభ్యంతరం చెప్పారు. తమ ఆరోపణలకు కట్టుబడి ఉన్నాం అని, తాము స్టేట్మెంట్ ఇచ్చేది లేదని చెప్పటంతో, పోలీసులు రేపు ఉదయం వస్తామని, స్టేట్మెంట్ ఇవ్వకపోతే నోటీసులు ఇస్తామని చెప్పారు. అయితే పోలీసులు గతంలో కూడా చంద్రబాబు సహా, ఇతర నేతలకు కూడా ఇలాగే ఆధారాలు ఇవ్వాలంటూ చెప్పటం పై, పలువురు ఆశ్చర్య పోతున్నారు. నిజమో కాదో, పోలీసులు చెప్పాలి కానీ, ఆధారాలు ఇవ్వమని టిడిపి నాయకులను అడగటం ఏమిటి అనే విమర్శలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read