క-రో-నా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో, ఏపి ప్రజల్లో హాట్ టాపిక్ గా నిలిచారు, కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య. ఆయన తాయారు చేసే మందు తీసుకుంటే, క-రో-నా రాదని, అలాగే వచ్చిన వారికి నయం అయిపోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే ఆక్సిజన్ తగ్గిన వారికి కూడా కంట్లో చుక్కల మందు వేస్తే వెంటనే ఆక్సిజన్ పెరుగుతుంది అని కూడా ప్రచారం జరిగింది. ప్రచారం మాత్రమే అయితే ఫెయిల్ అయ్యేది, ప్రజలు ఇక్కడకు వచ్చి, ఆ మందు తీసుకుని, నయం అయిన వారు కూడా ఉండటంతో, ప్రజల్లో విశ్వాసం పెరిగింది. తండోపతండాలుగా వచ్చారు. మరో పక్క అయన రూపాయి తీసుకోకుండా ఈ మందు ఇవ్వటం, ఎక్కడా డబ్బు ప్రస్తావన కూడా లేకపోవటంతో, ఆయన మందుకు క్రెడిబిలిటీకు ప్రజల్లో వచ్చింది. మరో పక్క సైన్స్ పరంగా కొంత మంది వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రజల్లో ఉన్న ఆదరణ చూసిన ప్రభుత్వం, రంగంలోకి దిగింది. తరువాత కొన్ని రోజులు మందు పంపిణీ ఆగిపోయింది. ప్రభుత్వ పెద్దలు బ్లాక్ లో తయారు చేసి అమ్మించారు అని కూడా ప్రచారంలోకి వచ్చింది. మొత్తం మీద ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. కోర్టు జోక్యంతో, ఎలాంటి హాని లేదని తేలటంతో, అనుమతులు ఇచ్చారు.
అయితే ఇప్పుడు క-రో-నా తగ్గటం, వ్యాక్సిన్ లు కూడా జోరుగా సాగుతూ ఉండటంతో, ఈ మందు నెమ్మదిగా కనుమరుగు అయిపొయింది. ఇప్పుడు తాజాగా మరోమారు ఆనందయ్య వార్తల్లోకి ఎక్కారు. తాజాగా విజయనగరం జిల్లాలో యాదవుల సమీక్షా సమావేశానికి వచ్చిన ఆనందయ్య, మీడియాతో మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. తన మందు ప్రజలకు ఇవ్వనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుందని అన్నారు. ఒకానొక సమయంలో తనను అరెస్ట్ చేయటానికి కూడా ప్రభుత్వం వెనుకాడ లేదని అన్నారు. కృష్ణపట్నం ప్రజలను చూసి పోలీసులు వెనక్కు తగ్గారని అన్నారు. ఇప్పటికీ తన మందు క-రో-నా తగ్గిస్తుందని నమ్ముతానని అన్నారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ, యాదవులకు సరైన ప్రాతినిధ్యం రావటం లేదని అన్నారు. రాజకీయంగా బీసిలు ఎదగాలని అన్నారు. రాజ్యాధికారం దిశగా పని చేస్తామని, కొత్త పార్టీ కూడా ఒకటి పెడతాం అంటూ, మీడియాకు తెలిపారు. ఏపి ప్రభుత్వం పై విమర్శలు గుప్పించిన ఆనందయ్య మరోసారి వార్తల్లో నిలిచారు.