జగన్ ప్రభుత్వం అట్టహసంగా ఈ రోజు రైతు దినోత్సవం చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి దాకా, ప్రకృతితో మమేకమయ్యే ఏరువాక కార్యక్రమం, పౌర్ణమి రోజున చంద్రబాబు ప్రభుత్వం చేసేది. చంద్రబాబు ప్రభుత్వమే కాదు, మన ఆచారం కూడా అదే. పల్లెటూరుల్లో, పౌర్ణమి రోజున ఏరువాక కార్యక్రమంతో, పనులు మొదలు పెడతారు. అయితే, ప్రభుత్వం మారటంతో, జగన్ గారి నాన్న అయిన వైఎస్ఆర్ పుట్టిన రోజున, జులై 8 న రైతు దినోత్సవం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, రైతులకు అది చేస్తా, ఇది చేస్తాం, రాజన్న రాజ్యం అంటూ ఊదరగొట్టారు. నిజంగా రైతులకు ఏమి సహాయం చేస్తున్నారో కాని, ఒక పక్క రైతులకు మాత్రం విత్తనాలు లేక విలవిలలాడుతున్నారు. రాయలసీమలో వేరుశనగ విత్తనాల కోసం, డెల్టా ప్రాంతంలో నీళ్ళ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. జూలై రెండో వారం వచ్చినా, ఇంకా రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం రైతు దినోత్సవం అని ఘనంగా చేసి, గొప్పగా మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటుంటే, ఇదే రోజు అనంత రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు.

గత నెల రోజుల నుంచి, విత్తనాల కోసం అల్లాడిపోయిన రైతులు, ఈ రోజు కూడా ఉద్యోమించారు. అనంతపురం జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు వేరుశనగ విత్తనాలు ఇస్తామని రైతులని పిలిపించి, కొంచెం సేపు ఆగి ఈ రోజుకు స్టాక్ లేదని వ్యవసాయ అధికారులు చేతులు ఎత్తేయడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉరవకొండ మండలంలో, అయుదు గ్రామాల రైతులకు, ఈ రోజు విత్తనాలు ఇస్తాం రమ్మని అధికారులు కబురు పంపారు. ఎన్నాళ్ళకు పిలిచారో అని రైతులు అనుకుని, రైతులంతా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. కొంచెం లేట్ అయినా విత్తనాలు వస్తాయని ఆశ పడ్డారు. అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో కార్యాలయానికి వచ్చిన అధికారులు, ఇంకా విత్తనాల స్టాక్ రాలేదనీ, వచ్చిన తరువాత కబురు చేస్తాం, వెళ్ళిపొండి అని రైతులకు చెప్పటంతో, వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. [ఇంత అన్యాయం చేస్తారా అంటూ, ఐదు గ్రామాల రైతులు ఉరవకొండ-గుంతకల్ రహదారి పై గంట పాటు బైఠాయించి ఆందోళన చేసారు. చివరకు పోలీసులు రావటంతో, చేసేది లేక, అక్కడ నుంచి రైతులు వెళ్ళిపోయారు. ఇది రైతు దినోత్సవం చేస్తున్న ప్రభుత్వం, ఈ రోజు రైతులకు ఇచ్చిన గిఫ్ట్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read