వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎట్టకేలకు సుప్రీం కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హ-త్య కేసులో అనంతబాబు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అనంతబాబు డీఫాల్ట్ బెయిల్ పిటీషన్ పై, ఈ రోజు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. వదనలు విన్న అనంతరం సుప్రీం కోర్ట్ బెయిల్ ఇచ్చింది. ఈ ఏడాది మే 23న పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేసారు. అప్పటి నుంచి అతను రాజమండ్రి జైలులో ఉన్నారు. కింద కోర్ట్ బెయిల్ ని నాలుగు సార్లు తిరస్కరించింది. ఆ తరువాత హైకోర్టు కూడా తిరస్కరించింది. దీని పైన ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేయగా, ఎట్టకేలకు సుప్రీంలో బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో మొదట అనంతబాబు పై కేసు పెట్టలేదు. ఆందోళనలు తరువాతే కేసు పెట్టారు. అయితే పోలీసులు కూడా ఈ కేసులో సరిగ్గా చార్జ్ షీట్ వేయలేదు అనే విమర్శలు వచ్చాయి. దాదపుగా ఆరు నెలలు అనంతబాబు జైల్లో ఉన్నారు. అయితే ఈ తీర్పు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చార్జిషీట్ పదే పదే ఉపసంహరించుకోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఏపి ప్రభుత్వం ఖంగుతింది. అనంతబాబుని రక్షిస్తున్నారు అంటూ, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, సుప్రీం వ్యాఖ్యలతో నిజం అయ్యాయి...
ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో, ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్...
Advertisements