కరువు అంటే అనంతపురం.. అనంతపురం అంటే కరువు!. ఏపీలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం. అలాంటి జిల్లా, గత రెండేళ్ళ నుంచి తన రూపు మార్చుకుంది... భూముల్లోకి నీరొచ్చింది.... భూమి లోపలి నుంచి ఉబికొచ్చింది.. ఎటుచూసినా.. పంటలు నిండిన పొలాలే.... అనంతపురం అంటే కరువు మాత్రమే అనుకునేవారు, కళ్లు నుళిమి ఇది నిజంగా అనంతేనా అని చూస్తున్నారు.. ఇది కలా.. నిజమా.. అని.. సంబర పడుతున్నారు... ఇవాళ అనంతపురంలో కరువు మాతమే ఉంది అని అనుకుంటూ పర్యటన చెయ్యటానికి వస్తున్న పవన్ కూడా, ఆశ్చర్యంతో చూడాల్సిందే...
పచ్చగా ఉన్న పొలాలు, నిండుగా ఉన్న చెరువులు, పవన్ కు స్వాగతం పలుకుతున్నాయి... పవన్ కూడా, ఆ పంటలు, నీరు చూసి తప్పక ఆనందిస్తారు... తుంగభద్ర ఎగువ కాలువ (టీబీ హెచ్చెల్సీ), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టులు కల్పతరువులా మారాయి. జిల్లా దాహార్తి తీర్చడమే కాదు.. అన్నదాత మోమున వెలుగులు నింపాయి. ఏటా కనుచూపు మేర బీడు భూములే కన్పించేవి.. నేడు దశదిశలా పచ్చదనం వెల్లివిరుస్తోంది. మూడేళ్ల తర్వాత మళ్లీ ఆశించిన మేర నీరు జిల్లాకు చేరడం శుభ పరిణామం. అన్ని ప్రాంతాలను ఆదుకోవాలనే ప్రభుత్వ ముందుచూపు.. జల నిర్వహణ.. నీటి పంపిణీలో పారదర్శకతతో సాగుకు జీవం వచ్చింది...
అనంతపురంలో నీటిని చూస్తామా అనుకున్న పెద్ద వయసు వాళ్ళు అందరూ, ఈ నీటిని చూసి "మా జీవితకాలంలో నీరు చూస్తాం అనుకోలేదు అని ఉద్విగ్నంగా చెప్తున్నారు" నలభై ఏళ్ళ నుంచి నిండని చెరువులు కూడా నిండాయి అంటే, అనంత కోనసీమతో ఎలా పోటీ పడుతుందో చెప్పవచ్చు... రాయలసీమలోనే అతి పెద్ద చెరువు, బుక్కపట్నం చెరువుకు దాదాపు దశాబ్దం తరువాత నీరు విడుదల అయ్యింది... హాంద్రీనీవా నీటితో అనంతపురంజిల్లా కరువు పరిస్థితుల్లో మార్పువచ్చింది. జిల్లాలోని జీడిపల్లి,గొల్లపల్లి రిజర్వాయర్లలలో జలకళ, వీటితోపాటు జిల్లావ్యాప్తంగా పలుచెరువులను కృష్ణాజలాలతో నింపడంతో భూగర్బజలాలు పెరిగాయి. జలసిరులు అందుబాటులోకి రావడంతో గుతకల్లు, ఉరవకొండ, రాప్తాడు నియోజక వర్గాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు... ఇప్పుడు అనంతపురంలో ఉన్న పరిస్థితి గురించి, ఆ రైతులు ఏమంటున్నారో మీరే వినండి...