అనంతపురం జిల్లాలో వైసీపీకి ఇదేం ఖర్మ అని తలలు పట్టుకుంటున్నారు వైసీపీ నేతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరువాత పార్టీలో అన్నీ తానై నడిపించే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా అంతటా వైసీపీలో అసమ్మతిని చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి రంగంలోకి దిగారని తెలుసుకున్న నేతలు ఎక్కడిక్కడే తమ బలప్రదర్శనకి వేదికగా చేసుకున్నారు. పెనుగొండలో మాజీ మంత్రి శంకరనారాయణ తీరు పట్ల తీవ్ర కోపంగా వున్న వైసీపీ అసమ్మతి నేతలు పెద్దిరెడ్డి పై చెప్పులు విసరడానికి కూడా వెనుకాడలేదు. పరిస్థితి చక్కదిద్దేందుకు దిగిన పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతలు నిరసనకి దిగడం అధిష్టానాన్ని షాక్ కి గురిచేసింది. పెద్దిరెడ్డి కాన్వాయ్ కి అడ్డంపడడం తీవ్రంగా పరిగణించినా అసమ్మతి నేతలు లెక్కచేయలేదు. మంత్రి ఉషశ్రీ పై వ్యతిరేకత కూడా పెద్దిరెడ్డిపై ప్రతిబింబించింది. అసమ్మతి చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి హాజరయ్యే ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. కదిరి, హిందూపురం, పుట్టపర్తి నియోజకవర్గాల వైసీపీలోనూ తిరుగుబాట్లు వైసీపీ పెద్దలు పెద్దిరెడ్డికి తలపోటుగా మారాయి.
అనంతపురంలో వైసీపీకి ఇదేమి ఖర్మ? పెద్దిరెడ్డి వల్ల కూడా కానంతగా దిగజారిపోయింది...
Advertisements