దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హ-త్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని ఈ రోజు రాజమండ్రి కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు. ఈ రోజు తో ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా పూర్తవుతుంది. అయితే ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ని, ఈ రోజు రాజమండ్రి కి సంబంధించిన SC , ST అట్రాసిటి కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. అయితే SC , ST అట్రాసిటి కోర్టుకు సంభందించిన న్యాయమూర్తి విధి నిర్వహణలో భాగంగా అమలాపురం వెళ్లినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో అనంత బాబుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు హాజరు పరుస్తారా లేదా అనేదిఉత్కంఠగా మారింది. అయితే ఇప్పటి వరకు అనంతబాబుని, పోలీసులు కస్టడీకి తీసుకోక పోవటం, అందరినీ ఆశ్చర్య పరిచింది. చిన్న చిన్న కేసులకు కూడా కస్టడీకి తీసుకునే పోలీసులు, అనంతబాబుని ఎందుకు కస్టడీకి తీసుకోలేదు అనేది ఎవరికీ అంతు బట్టటం లేదు. మరో పక్క అనంతబాబు, ఇప్పటికే బెయిల్ పిటీషన్ వేసారు. మరి ఈ బెయిల్ వద్దు అని, పోలీసులు వాదిస్తారో లేదో చూడాలి.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో, దిమ్మ తిరిగే వాస్తవం.. పోలీసులు పై అనుమానాలు..
Advertisements