అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి, కేంద్రానికి పమించటం, కేంద్రం నోటిఫై చేయటం, రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతున్న ప్రక్రియలో, మధ్యలో వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని ఆపేసిన తరువాత, అక్కడ రైతులు, మహిళలు మోసపోయామని గ్రహించి, రోడ్డు మీదకు వచ్చి 550 రోజులు దాటింది. అమరావతి రైతులు న్యాయస్థానాల్లో ఈ విషయం పై పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని విషయం , న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే న్యాయస్థానంలో ఈ అంశం ఉన్నా కూడా, కోర్టులను గౌరవించకుండా, విజయసాయి రెడ్డి కానీ, బొత్సా కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ తరుణంలో యాంకర్ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు అమరావతి వాసులకు మరింత ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఒక టీవీ షోలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే, విశాఖపట్నం అంటూ, తన షోలో యాంకర్ ప్రదీప్ చెప్పించటంపై, పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి వ్యతిరేకంగా, మాట్లాడిన యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యల పై అమరావతి పరిరక్షణ సమితి, ఆంధ్రప్రేదేస్ పరిరక్షణ సమితి తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేస్తున్నాయి. యాంకర్ ప్రదీప్ అమరావతికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
అమరావతి పై యాంకర్ ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, అమరావతి వాసులకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఈ రోజు మధ్యానం 12 గంటల లోపు, యాంకర్ ప్రదీప్ ఆ మాటలు ఉపసంహరించుకోవాలని, లేకపోతే హైదరాబాద్ లో ఉన్న, యాంకర్ ప్రదీప్ ఇంటిని, అలాగే జీటీవీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కొలికలపూడి శ్రీనివాస్ ప్రకటించారు. అమరావతి అంశం పై కోర్టులో ఉందని, కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఒక ప్రాంత వాసుల మనోభావాలను దెబ్బ తీయటం ఆపాలని అమరావతి వాసులు డిమాండ్ చేస్తున్నారు. 550 రోజులుగా రోడ్డు ఎక్కి రైతులు, మహిళలు, పిల్లలు ఆందోళన చేస్తుంటే, ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, తమ సమస్య పై స్పందించకపోగా, మరో వైపు నుంచి ఇష్టం వచ్చినట్టు తమ పై వ్యాఖ్యలు చేస్తున్నారని, అమరావతి వాసులు మండి పడుతున్నారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నాం కదా అని, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తే, చూస్తూ ఊరుకోం అని హెచ్చరిస్తున్నారు.