రాష్ట్ర విభజన అనంతరం, ఈ రాష్ట్రాన్ని గర్వంగా నిలబెట్టిన తీరు, ఈ దేశానికే ఆదర్శం అయ్యింది... అందుకే, మన సక్సెస్ స్టొరీ, ఇప్పుడు అమెరికాలో వినిపించనుంది... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఈ సమావేశంలో పాల్గుననున్నారు... మన రాష్ట్ర ప్రగతి, చంద్రబాబు విధానాలు ఇప్పుడు వరల్డ్ సక్సెస్ స్టొరీ అయ్యింది... ఇది మన రాష్ట్రానికి, చంద్రబాబు నాయకత్వంలో దక్కిన అరుదైన గౌరవం...

అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస ప్రత్యేక సమావేశానికి, మన దేశం తరఫున ఆంధ్రప్రదేశ్‌ను పంపించాలని కేంద్రం నిర్ణయిచింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్‌ 11.72 శాతం వృద్ధి రేటును సాధించడాన్ని పరిగణనలోకి తీసుకున్న నీతి ఆయోగ్‌ ఈ సమావేశం కోసం ఏపీ పేరును సూచించింది. రాష్ట్ర విభజన తర్వాత సాధించిన అభివృద్ధిని ఈ సమావేశంలో ప్రస్తావించాలని, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

వృద్ధి రేటుతో పాటు, చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఏపీలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ-అభివృద్ధి పథకాలు, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా-గోదావరి అనుసంధానానికి తీసుకున్న చర్యలు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ప్రపంచంలోనే అతి పెద్ద సోలార్ పార్క్ నిర్మాణం, LED బుల్బులతో ఇంధన ఆదా, వ్యవసాయంలో బెస్ట్ ప్రాక్టీసెస్, గ్రామాల్లో CC రోడ్డులు తదితరాలను గుర్తిస్తూ నీతిఆయోగ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ సమావేశంలో చర్చించే అంశాలు, దాదాపు 100 దేశాల్లో అమలు చెయ్యనున్నారు... ఇది ఆంధ్రోడి సత్తా... ఆంధ్రోడు దేశానికే కాదు, ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శం కానున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read