గొర్రెపాటి ఉమామహేశ్వరరావు... ఈయనొక లారీకి ఓనర్ కమ్ డ్రైవర్... డీజిల్ పెరుగుదల, ఇన్సూరెన్సుల పెరుగుదల, టోల్ ట్యాక్స్ పెంపుదల వీటన్నిటి వలన ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బలు తినీ తినీ ఆ ఆవేదనను నిరసన ద్వారా చూపించాడు... దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న అన్యాయం మరో వైపు.. నిరసన తెలిపే విధానం ఒక్కొక్కరిదీ ఒకో దారి. ఆయన ఎంచుకున్న దారిని మనం సమర్ధించ కూడదు కానీ ఆయన నిరసనను అర్ధం చేసుకోవాలి. ఆ నిరసన ఆయన ఒక్కడిదే అనుకుంటే అది తెలివితక్కువ తనం అవుతుంది. న్యాయం కోసం తిరగబడటం చట్టం కాకపోవచ్చు కానీ అది ధర్మం. సామాన్యుడి కి చట్టం కన్నా న్యాయం మీదనే మక్కువ ఎక్కువ. ఎందుకంటే వాడికి నీతి మాత్రమే తెలుసు.
నిన్నటివరకు ఈ ఉమామహేశ్వరరావు ఒక సామాన్యుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆక్రోశాన్ని తెలియజేసిన తెగువ ఉన్నోడు. తెలంగాణ ఉద్యమ సమయంలో జెపి మీద చేయిచేసుకున్న వ్యక్తిది జెపి మీద ద్వేషం కాదు, ఆక్రోశం. ఏం చేయాలో అర్థం కానప్పుడు నిస్సహాయత తో కట్టిపడేసినప్పుడు, చిరకాల వాంఛకు ఎవరైనా అడ్డు తగులుతున్నప్పుడు, ఒక తరాన్ని తమ భవిష్యత్తు ను కొంతమంది పనికట్టుకొని నాశనం చేస్తుంటే కడుపుమంట తాలూకు ఉద్వేగం. ఇప్పుడు ఈ ఉమా మహేశ్వరరావు ది కూడా అదే ఉద్వేగం. కడుపుమండిన సామాన్యుడు చూపించిన తెగువ.
భౌతిక దాడులు సరైనవి కావు. కానీ, కడుపు మంటను అర్థం చేసుకోమనే హెచ్చరికైతే అందులో ఉంది. ఈ భౌతిక దాడిని సమర్థించలేము కానీ, ఆ స్పూర్తి ని మాత్రం సమర్థిస్తాము. నిన్న ఈయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఆయన చెప్పిన మాటలు, ప్రతి ఆంధ్రుడి బాధ.. మోడీ వున్నా నేను అదే పని చేసేవాడిని అని చెప్పిన తెగువ ఉన్న ఆంధ్రుదుడు. ఉమామహేశ్వరరావు లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి. జగన్, పవన్ లాంటి ఉడత ఊపుడు గాళ్ళకి, మోడీ అనే మాట పలకలేని లేని వాళ్ళకంటే, ఈ సామాన్య లారీ డ్రైవర్ వంద రెట్లు నయం. దాడులు చెయ్యకుండా, వారికి బుద్ధి వచ్చేలా, రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుతో ప్రశ్నించండి. చెప్పు విసిరినందుకే ఉమామహేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తే, ఆయన్ను గొడ్డును బాదినట్టు బాడిన, బీజేపీ బానిసలను, పోలీసులు ఎందుకు వదిలిపెట్టారు ?