అలవికాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కృతఙ్ఞతలు తెలిపారు. ఉండవల్లిలోని ప్రజావేదికకు పెద్దసంఖ్యలో వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును అంగన్వాడీ టీచర్లు కలిసారు. మంత్రి పరిటాల సునీత, మహిళా శిశిసంక్షేమ శాఖ అధికార్లు, మహిళా నేత రాణిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఒక పార్టీ వరుస ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

anganwai 23062018 2

నాలుగేళ్ళలో కేంద్రం సహకరించకపోయినా అంగనవాడీ టీచర్ల, ఆయాల బాధలను తొలగించేందుకు జీతాలు రూ. 10500, రూ.6000కు పెంచామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పేదవాళ్ళకు అండగా ఉండాలనే లక్ష్యంతో అంగన్వాడీ, ఆయాల వేతనాలు పెంచామన్నారు. అంగన్వాడీలు ఆనందంగా ఉంటే వారు పెంచే పేద పిల్లలు ఆరోగ్యంతో ఎదుగుతారన్నారు.తద్వారా వారి తల్లిదండ్రులు చివరకు సమాజం సంతోషంగా ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం, బంధుత్వంతో సంబంధం లేకుండా పేదరికాన్ని తొలగించడానికే అంగన్వాడీ టీచర్లు, ఆయా లకు జీతాలు పెంచామన్నారు. 2018-19 ఏడాదిని పేదపిల్లల్లో పౌష్టికాహారం లోపం లేకుండా పెంచాలన్న లక్ష్యాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. జీతాలు పెరగడంతో అంగన్వాడీ టీచర్లలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఆనందం కనపడుతోందన్నారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలన్నింటినీ తొలగించి నిరంతరం అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశానికి అంగన్వాడీ టీచర్లు అండగా ఉంటారన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

anganwai 23062018 3

"నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్ల జీతాలను రూ.4200 నుంచి 7000, ఇప్పుడు రూ.10500కు పెంచాం. ఆయాలకు కూడా గతంలో ఉన్న రూ. 2500, రూ.4500 ఇప్పుడు రూ. 6000 కు పెంచాం. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై రూ.305 కోట్ల భారం పడుతుంది. అంగన్వాడీ టీచర్ల ఆనందంగా ఉండటమే లక్ష్యంగా సాహసోపేతమైన జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నాం. జీతాల పెంపుతో అంగన్వాడీ టీచర్లలో ఆనందం, ఉత్సాహం కనపడటం సంతోషకరం. ప్రతి ఒక్కరికీ ఆర్థిక వెసులుబాటు ఉంటే ఆయా వృత్తులు, పనుల్లో మెరుగైన ఫలితాలు సాధ్యం. ఒకపక్క ఇల్లు, మరోపక్క పేదపిల్లలను చూసుకునే అంగన్వాడీ టీచర్ల కు ఆర్థిక మద్దతు ఇవ్వాలని భావించి జీతాలు పెంచడం జరిగింది. భవిష్యత్తు భావీభారత పౌరులైన పిల్లలను తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు అండగా నిలవాలని భావించా" అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read