బుల్లెట్టు దిగిందా లేదా అని అసెంబ్లీలో రౌడీ భాష మాట్లాడిన మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కి కోటంరెడ్డి బుల్లెట్టు బాగానే దిగినట్టుంది. కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అంటాడు ప్రభాస్. తన కటౌట్ చుట్టూ 15 మంది పోలీసుల్ని కాపలా పెట్టుకున్నప్పుడే అనిల్ కుమార్ యాదవ్ ఎంత భయపడుతున్నాడో అర్థం అయిపోతోంది. నెల్లూరులో కోటంరెడ్డి పేరు వింటేనే అనిల్ కుమార్ యాదవ్ ఉలిక్కి పడుతున్నారు. గతంలో వీళ్లిద్దరూ మంచి దోస్తులు. ఎప్పుడైతే కోటంరెడ్డి వైసీపీతో విభేధించారో అప్పుడే శత్రువులు అయ్యారు. వైసీపీకి చెందిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జన్మదినం నర్తకీ కూడలిలో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌కి 15 మంది పోలీసుల్ని కాపలాగా పెట్టుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించేందుకు ఆదివారం నర్తకీ కూడలికి వచ్చారు. అక్కడే ఏర్పాటు చేసిన అనిల్ కుమార్ యాదవ్ కటౌట్ ని కోటంరెడ్డి అనుచరులు ఏమైనా చేస్తారేమోననే అనుమానంతో కటౌట్‌కి పోలీసుల్ని కాపలాగా పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. మనుషుల్ని నడిరోడ్లపై పట్టపగలు చంపేస్తుంటే పట్టించుకోని ఏపీ రాష్ట్రంలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే కటౌట్ రక్షణకి ఓ సీఐ, 15మంది కానిస్టేబుల్స్ ని కాపలాగా పెట్టడం చూసి జనం విస్తుపోతున్నారు. జనం ప్రాణాల కంటే కటౌట్ల రక్షణకే విలువనిచ్చే పాలకులు ఉండటం మన దురదృష్టం అని తమని తామే నిందించుకుంటున్నారు.
ఇదేమి బిల్డ్ అప్ ? అనిల్ కుమార్ యాదవ్ కటౌట్‌కి 15 మంది పోలీసుల కాపలా
Advertisements