ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కళ తప్పింది. ప్రధానంగా గత క్యాబినెట్ లో ఉన్న అయుదు మంది మంత్రులు ఈ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టారు. ఇందులో ప్రధానంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత, వీళ్ళిద్దరూ నిన్నటి నుంచి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే గతంలో గృహ నిర్మాణ శాఖా మంత్రిగా పని చేసిన శ్రీరంగరాజు కానీ, అలాగే జలవనరులు శాఖా మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ కానీ, అదే విధంగా వీరితో పాటు, మాజీ డిప్యూటీ సియం ఆళ్ళ నాని కానీ, వీరు అయుదుగురు కూడా, ప్రమాణస్వీకర కార్యక్రమానికి రాలేదు. వీరితో పాటు, అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు, ఎవరు అయితే ఉన్నారో, మంత్రి పదవి ఆశించి, భంగ పడిన వారు అంతా కూడా, ప్రమాణస్వీకర కార్యక్రమానికి రాలేదు. వీరితో పాటుగా, అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రమాణ స్వీకర కార్యక్రమానికి హాజరు కాకపోవటంతో, వైసీపీ శ్రేణులు ఆశ్చర్య పోయాయి. అదే విధంగా, వైసీపీ వర్గాల్లో ఉన్న అసంతృప్తి కూడా, ఈ దెబ్బతో బయట పడింది. ఇక మంత్రిగా పని చేసిన శ్రీరంగరాజు కూడా అసంతృప్తితో, ఆయన ఫాం హౌస్ కి వెళ్లిపోయారని తెలుస్తుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సుచరిత అనుచరులు ఇప్పటికే నిరసన తెలపి రచ్చ రచ్చ చేస్తున్నారు.

anil 11042022 2

వాళ్ళుకూడా రాజీనామా చేస్తారని వార్తలు రావటం, ఇప్పటికే సుచరిత రాజీనామా చేయటం, బాలినేని మరి కొద్ది సేపట్లో రాజీనామా చేస్తారని చెప్తున్నారు. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఎంత మంది వచ్చి బుజ్జగించినా, బాలినేని మాత్రం ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాలేదు. ఇక అనిల్ కుమార్ యాదవ్ కూడా రాకపోవటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. కొడాలి నాని, పేర్ని నాని లాగా, అనిల్ కుమార్ యాదవ్ కూడా విధేయంగా ఉంటారు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు రాలేదో అని చర్చ జరుగుతుంది. అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు మాత్రం, ఈ విషయంలో ఏమి చెప్పటం లేదు. ఇక ప్రమాణ స్వీకారానికి వచ్చిన, మాజీ మంత్రులు కూడా ఏదో వచ్చాం అంటే వచ్చాం అనే విధంగా, ముభావంగా కూర్చున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎక్కడా కూడా కళ కనిపించ లేదు. ఈ అగ్రహ జ్వాలలు, నిరసనలు ఎక్కడి వరకు వెళ్తాయో అని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. అనవసరంగా తేనె తుట్టిని కదిపామా అనే అభిప్రాయం వైసీపీ అధిష్టానంలో వ్యక్తం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read