ఇండియాన్ క్రికెట్ చరిత్రలో నెంబర్ వన్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకుని రిటైర్డ్ అయిన అనిల్ కుంబ్లే, ఇవాళ విజయవాడలో పర్యటించారు.... విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీలో రాష్ట్ర యువజన శాఖ నిర్వహించిన జాతీయ యువజనోత్సవాల్లో క్రికెటర్ అనిల్ కుంబ్లే పాల్గుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కుంబ్లేతో పాటు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా కుంబ్లే అక్కడ యువతని ఉద్దేశించి మాట్లాడారు... ముందుగా తెలుగులో మాట్లాడుతూ "అందరకీ నమస్కారం" అని సంబోదించారు... తెలుగులో ప్రసంగం మొదలు పెట్టటంతో, అక్కడ ఉన్న యువత అంతా కేరింతలు కొట్టారు...
తరువాత, ప్రసంగం కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డైనమిక్, విజనరీ లీడర్ అని, ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని అనిల్ కుంబ్లే కొనియాడారు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు ఈ సమావేశంలో మాట్లాడే అవకాసం ఇచ్చినందుకు సంతోషం అంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు... చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అని, వారు చేస్తున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని కుంబ్లే కోరారు.... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీని కూడా కుంబ్లే కొనియాడారు...
వివేకానందుడి జీవితం నేటి తరానికి మార్గదర్శకమని, వివేకానందుడు సూచించిన మార్గాన్ని యువత అనుసరించాలని ఆయన పిలుపు ఇచ్చారు. క్రీడలు మానసిక వికాసాన్ని, క్రమశిక్షణను నేర్పుతాయని కుంబ్లే అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జాతీయ యువజనోత్సవ కార్యక్రమం దేశమంతటా జరిగింది... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీలో ఏర్పాటు చేసేంది...