అందరి రాజకీయ నాయకుల్లాగా ఓట్లు సీట్లు కోసమే కాదు, భవిష్యత్తు తరాల గురించి ఇప్పటి నుంచే ఆలోచించే నేత చంద్రబాబు. అందుకే అభివృద్ధి, సంక్షేమం మాత్రామే కాదు, ఎన్నో రిఫార్మ్స్ కూడా తీసుకువచ్చి, సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఫిజికల్ లిటరసీని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా, ‘ప్రాజెక్టు గాండీవ’ పేరుతో, రాష్ట్రానికి మంచి క్రీడాకారులని తయారు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ నల 24న విజయవాడలోని, విధ్యాధరపురంలో చంద్రబాబు ఈ కార్యక్రమం మొదలు పెట్టనున్నారు. చంద్రబాబు ప్రయత్నాలకు, స్టార్ట్ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. ఒక వీడియో మెసేజ్ ద్వారా, చంద్రబాబు ప్రయత్నాలకు, విషెస్ చెప్పారు. యువత ఈ అవకాశం ఉపయోగించుకోవాలని, పిలుపిచ్చారు.
అలాగే కిదంబి శ్రీకాంత్ కూడా, ట్విట్టర్ ద్వరా అభినందించారు. "This is a great initiative by our honourable CM Shri.Chandrababu Naidu garu and I wish the whole team a huge success and let’s all hope that #ProjectGaandiva produces future medal winners". ఒలింపిక్ పోటీలలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ‘ప్రాజెక్టు గాండీవ’ పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రతిభావంతులను ఎంపికచేసే ప్రక్రియ జరుగుతోంది. అథ్లెట్ల ఎంపిక పూర్తయిన తరువాత, మలిదశలో వీరిని ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’కు పంపించి అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణఅందిస్తారు.
‘పాంచజన్య’ ప్రాజెక్టు కింద బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, సైక్లింగ్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్ బాల్, వాలీబాల్ తదితర క్రీడలలో విద్యార్థులకు శిక్షణ అందిస్తురు. అన్ని పాఠశాలలో ఫిజికల్ లిటరసీని ప్రోత్సహిస్తున్నారు. అనంతపురము జిల్లా కేంద్రంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్ల వ్యయంతో ఇండోర్, అవుడ్డోర్ స్పోర్ట్స్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ప్రఖ్యాత అమెరికన్ స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఏపీ స్పోర్ట్స్ యూనివర్శిటీ సహకారంతో విశాఖ నగరంలో 250 ఎకరాలలో పీపీపీ పద్ధతిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో పీపీపీ విధానంలోనే 70 ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్ సిటీని నెలకొల్పుతున్నారు. విజయవాడ విద్యాధరపురంలో 9 ఎకరాలలో స్పోర్ట్ షాపింగ్ కాంప్లెక్స్ సిద్ధం చేస్తున్నారు. రూ.175 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో చేపట్టిన బీఆర్ స్టేడియం నిర్మాణ పనులు టెండర్ల దశలో ఉన్నాయి.