నవ్యాంద్రలో తొలి అథ్లెటిక్‌ స్టేడియానికి మచిలీపట్నం వేదిక కాబోతోంది. రూ.15 కోట్లతో నిర్మించనున్న మైదానం పనులకు మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. భారత క్రికెట్‌ జట్టు తొలి కెప్టెన్‌ కల్నల్‌ సీకే నాయుడు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఎందరో క్రీడాకారులకు పుట్టినిల్లు అయిన మచిలీపట్నంలో ఇప్పటివరకూ క్రీడాపరమైన వసతులు లేవని ఆ కొరత తీర్చేలా స్టేడియం ఏర్పాటు చేయడం హర్షనీయమని కోచ్‌లు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. రూ. 13 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ క్రీడా మైదానానికి మంగళవారం ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు అనిల్‌ కుంబ్లే శంకుస్థాపన చేయనున్నారు.

anilkumble 24072018 2

మచిలీపట్నంలో గోసంఘంకు చెందిన 13.27 ఎకరాల్లో మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంతోపాటు, స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించనున్నారు. కేలో ఇండియా పథకం కింద ఈ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. మొదటి దశలో మైదానం ఆవరణలో 60 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఇండోర్‌ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పన్నెండున్నర మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించనున్నారు. ఈ ఇండోర్‌ స్టేడియంలో మొత్తం ఎనిమిది కోర్టులు ఉంటాయి. బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, కబడ్డీ, బాస్కెట్‌ బాల్‌ తదితర క్రీడలను ఈ స్టేడియంలో నిర్వహించుకోవచ్చు. మొత్తం రూ.ఎనిమిది కోట్లను ఈ నిర్మాణానికి వెచ్చిస్తున్నారు.

anilkumble 24072018 3

ఇక స్విమ్మింగ్‌పూల్‌ను కూడా అత్యంత ఆధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే విధంగా తీర్చిదిద్దనున్నారు. 50మీటర్ల వెడల్పు, 25మీటర్ల పొడవుతో దీనిని నిర్మించనున్నారు. ఈ స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణానికి అయిదుకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ స్టేడియంకు మొత్తం రూ.50 కోట్లతో అంచనాలను పంపగా, ప్రభుత్వం తొలిదశలో రూ.13 కోట్లు విడుదల చేసింది. మొత్తం స్టేడియంను దాదాపు 24 ఎకరాల్లో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలో గోసంఘం స్థలాన్ని హౌసింగ్‌కు ఇచ్చేయటంతో, ఆ స్థలం నిడివి తగ్గిపోయింది. అయినప్పటికీ కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ, స్టేడియంను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. సింథటిక్‌ ట్రాక్‌ కాకుండా, ప్రస్తుతానికి జనరల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంచలంచెలుగా నిధులు సమకూర్చి, ఈ స్టేడియంలో అంతర్జాతీయ సదుపాయాలు కల్పించాలనే భావనతో ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read