జగన్మోహన్ రెడ్డి తన స్వార్థప్రయోజనాలకోసం రాష్ట్రప్రయోజనాల ను ఎలా తాకట్టుపెట్టారో, రాష్ట్రాన్ని నిలువునా ఎలా ముంచేశారో కేంద్రంప్రకటించిన బడ్జెట్ తోనే తేటతెల్లమైందని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రజామోసపూరితయాత్ర లో 25 మంది ఎంపీల ను ఇస్తే ప్రత్యేకహోదా తెస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక సార్ ప్లీజ్... సార్ ప్లీజ్ అని అడుక్కోవడం తప్ప వేరేమార్గంలేదని చెప్పడం, అడుగుతూనే ఉందామనడం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన వంచనకాదా అని తెలుగుమహిళ రాష్ట్రవిభాగం అధ్యక్షు రాలు శ్రీమతి వంగలపూడి అనిత నిలదీశారు. బుధవారం ఆమె తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తూ, జగన్ యువతను, విద్యార్థులను దారుణంగా మోసగించాడన్నారు. ప్రత్యేకహోదా తెస్తానంటూ గతంలో ఊదరగొట్టి న జగన్, పలువేదికల్లో మాట్లాడుతూ పెయిడ్ ఆర్టిస్ట్ లతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని వారితో దారుణంగా దూషింపచేశాడన్నారు. ఆనాడు జగనన్న జగనన్నా ప్రత్యేకహోదా రావాలన్న పెయిడ్ విద్యార్థులంతా నేడు జగన్ చేసిన మోసంపై ఎందుకు మాట్లాడట లేదని అనితప్రశ్నించారు. ఆనాడు జగన్ ను పొగిడి, చంద్రబాబుని తిట్టినవారంతా నేడు వాలంటీర్ల ఉద్యోగాలు వెలగబెడుతూ నోరుతెరవలేని దుస్థితిలో ఉన్నారేమోనని ఆమె ఎద్దేవాచేశారు. రాష్ట్రానికి ఆర్థికలోటుతోపాటు, పోలవరం, వెనుకబ డిన జిల్లాలకు నిధులు, రైల్వేజోన్, పోర్టులు, మెట్రోరైల్ ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, పరిశ్రమలకు రాయితీలు ఏవీ ప్రకటించకుండా నేడు కేంద్రం రాష్ట్రాన్ని అనాథగా వదిలేయడానికి జగన్మోహన్ రెడ్డి చేతగా నితనం కారణం కాదాఅని అనిత మండిపడ్డారు.

జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఈ పెద్దమనిషి ప్రత్యేకహోదా కోసం వెళుతున్నాడని భావిం చినవారందరికీ ఇప్పటికీ వాస్తవం బోధపడిందన్నారు. జగన్ ఢిల్లీ వెళ్లడం, అమిత్ షాను, ఇతరకేంద్రమంత్రులను కలవడం, శాలువాలుకప్పి, బొకేలుఇచ్చి కేసులనుంచి బయటపడేయమని వారికాళ్లపై పడటం తప్ప, రాష్ట్రానికి రూపాయికూడా తీసుకొచ్చింది లేదన్నారు. ఏనాడూ రాష్ట్రప్రయోజనాలగురించి, జగన్ ఒక్క మాట కూడా కేంద్రంతో మాట్లాడిందిలేదని, అలా మాట్లాడాడని ఆయన గుండెలమీద చేయివేసుకొని చెప్పగలడా అని అనిత ప్రశ్నించారు. ప్రత్యేకవిమానాల్లో ప్రజలసొమ్ముని దుబారా చేస్తూ ఢిల్లీ వెళ్లిన జగన్ కేవలం బిల్డప్ ల కోసం, తనకేసులమాఫీకి మాత్రమే కేంద్రపెద్దల చుట్టూ తిరిగాడన్నారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకో వడానికే జగన్ అమిత్ షా, మోదీల ముందు మెడలు వంచాడన్నా రు. జగన్ తీరు ఆ విధంగా ఉంటే, అధికారపార్టీకి చెందిన 28మంది ఎంపీలు, ప్రత్యేకహోదా గురించి ఒక్కరోజైనా ఎందుకు మాట్లాడలేద న్నారు. గతంలో ప్రత్యేకహోదా కోసం నల్లరిబ్బన్లు కట్టుకున్నవారం తానేడు ఏమైపోయారన్నారు. పోలవరానికి నిధులు తీసుకొస్తాము. ... ప్రాజెక్టుని అప్పుడు పూర్తిచేస్తాం..ఇప్పుడుపూర్తిచేస్తాం అని చెప్పకునే ఇరిగేషన్ మంత్రి ఢిల్లీవెళ్లి, నిధులు ఎందుకు తేలేకపోయాడని అనిత నిగ్గదీశారు. ఇటువంటి వారంతా రాష్ట్రాన్ని నడిపిస్తాము..ఉద్ధరిస్తామని చెబితే, ఇంకాప్రజలునమ్మాలా అన్నా రు.

కేంద్రంనుంచి నిధులు తేలేని అసమర్థులు, రాష్ట్రప్రజలపై పన్ను లభారం వేస్తూ, వారిని పీల్చిపిప్పిచేస్తున్నారు. ప్రధాని మోదీ వెనకాలకూర్చున్నానని చెప్పుకునే మహానుభావుడు, టీవీల్లో కనిపించడం కోసమే వెనకాల కూర్చున్నాడని అర్థమైపోయిందన్నా రు. ప్రత్యేకహోదా తీసుకురాలేకపోతే తక్షణమే చంద్రబాబు తన పద వికి రాజీనామాచేయాలని డిమాండ్ చేసిన, ప్రబుధ్దులు నేడు ప్రత్యే కహోదాకోసం ఎందుకు రాజీనామాలు చేయడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలప్రయోజనాలకోసం, ప్రతితెలుగువాడి ప్రయోజనం కోసం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనునిత్యం పనిచేస్తూనే ఉన్నార న్నారు. అచ్చెన్నాయుడు ఏం నేరంచేశాడని ఆయనపై ఈ చేతగాని ప్రభుత్వం కేసుల పెట్టిందన్నారు. తనబంధువైన వ్యక్తితో అచ్చెన్నా యుడు మాట్లాడిన మాటల్లో ఎక్కడా అతన్ని బెదిరించినట్లులేదని, అయినాకూడాప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడాని కే ఆయనపై తప్పుడుకేసులుపెట్టి అరెస్ట్ చేసిందన్నారు. పట్టాభిగారు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటినుంచో ఎండగడుతూనే ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి తాలూకా అవినీతిని,పాలనా వైఫల్యా లను ఆధారాలతో సహా, కూలకషంగా ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నాడనే ఆయనపై దాడిచేయించారని అనిత స్పష్టంచేశారు .

Advertisements

Advertisements

Latest Articles

Most Read