జగన్ రెడ్డి పాలనలో మహిళలకు జరుగుతున్న అవమానాలు, వెతలు, వేధింపుల గురించి ఎంతలా ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి అర్థమయ్యేలా చెప్పాలని చూస్తున్నా, అధికారంలో ఉన్నవారు అహంకారంతో, మదంతో తాము చేసేది, చెప్పేదే సరైంది అన్నట్లుగా మాట్లాడుతున్నారని, మహిళాదినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహా, వైసీపీ నేతలంతా మాట్లాడింది విన్నవారెవరైనా తాము చెప్పినదానితో ఏకీభవించాల్సిందేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యురాలు, తెలుగు మహిళరాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అనిత స్పష్టంచేశారు. బుధవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే క్లుప్తంగా "మహిళలను గౌరవించే విషయంలో జగన్మోహన్ రెడ్డికే సంస్కారం లేవని ఇన్నాళ్లు భావించాము. తాను నెల్లూరులో నారీ సంకల్పదీక్ష కార్యక్రమంలో మాట్లాడి వచ్చిన తర్వాత, అక్కడుండే ఒక ఎమ్మెల్యేకి నోటిదురద ఎక్కువైంది. తన తండ్రి పలుకుబడితో, టీడీపీ పెట్టిన రాజకీయ భిక్షతో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన సదరు ప్రబుద్ధుడికి మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లుదగ్గరపెట్టుకోవాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం. తనకు తాను రాజకీయధీరుడినని చెప్పుకునే సదరు సోకాల్డ్ వైసీపీ ఎమ్మెల్యేకి గుర్తింపు పిచ్చి పరాకాష్టకుచేరింది. "
"ఆ క్రమంలో తన ఇంట్లోని తల్లిని, భార్యని దూషించి, వారి వ్యక్తిత్వాన్ని కూడా కించపరచడానికి వెనుకాడడు. అధికారంలో ఉండి మహిళల్నిగౌరవించలేని ఇలాంటి పశుప్రవృత్తి కలిగిన వారికి మనుషులుగా బతికే అర్హతఉందా అని ప్రశ్నిస్తున్నాం. ఒకతల్లి కడుపునపుట్టే అర్హత కూడా లేదు. నాగురించి అసభ్యంగా మాట్లాడిన సదరు సోకాల్డ్ వైసీపీ ఎమ్మెల్యేకి ఒకటే చెబుతున్నాను. తన తల్లి, భార్య వ్యక్తిత్వం ఎలాంటివో, నాది కూడా అలాంటి వ్యక్తిత్వమే. నా వ్యక్తిత్వం గురించి సదరు ఎమ్మెల్యే మాట్లాడే ముందు, తనభార్య, తన తల్లి, తన కూతురు ముందు ముందు ఎంతలా క్షోభపడాల్సి వస్తుందో సదరు వ్యక్తి ఆలోచించుకుంటే మంచిది. నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంత మంచిపేరుందో... ఆయన కడుపున పుట్టిన వ్యక్తి అంత సిగ్గులేని విధంగా తయారయ్యాడు. తన తల్లిని ప్రశ్నిస్తున్నాను...ఏంటమ్మా నీ కుమారుడిని ఇలా పెంచావని? నీ వ్యక్తిత్వానికి, నా వ్యక్తిత్వానికి నక్కకు, నాగలోకానికిఉన్నంత తేడా ఉంది. నువ్వు ఒక ఎమ్మెల్యేవి? నా కొడకల్లారా.. ఆడవాళ్ల వ్యక్తిత్వం గురించి మాట్లాడితే ఇంకోసారి మీకు బడతెపూజ ఖాయం. ఇంకోసారి వాగావు అంటే, వచ్చి నీ ఇంట్లో కూర్చుంటా. నీ సంగతి నీ ఇంట్లోనే తేలుస్తా" అని అనిత ఆవేశంగా మాట్లాడారు