రాష్ట్రంలో పేదలకు 5 రుపాయలకే అన్నం పెట్టే, అన్న క్యాంటీన్ ను తాజగా వచ్చిన జగన్ ప్రభుత్వం మూసేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఎక్కడ మైలేజ్ వస్తుందో అని, ముందుగా అన్న క్యాంటీన్ రంగులు మార్చేసారు. దీనికి ఎంత ఖర్చు అయ్యిందో తెలియదు కాని, సోషల్ మీడియాలో మాత్రం, 11 కోట్లు ఖర్చు అయ్యిందనే వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అయితే రంగులు మార్చితే మార్చారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారు కదా, రంగులు మార్చి, పేర్లు మార్చితే ఏమైందిలే అని అందరూ అనుకుంటున్న వేళ, మొన్న ఫస్ట్ తారీఖు నుంచి అన్న క్యాంటీన్లను పూర్తిగా మూసేసారు. ఎందుకు మూసారో, ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రభుత్వం మాత్రం, చంద్రబాబు ఆదరాబాదరాగా, ఒక లక్ష్యం లేకుండా పెట్టారని, వీటిని సమీక్షించి, అప్పుడు చెప్తాం అంటుంది.

anna 03082019 2

మరో పక్క 150 కోట్లు అవినీతి అన్న క్యాంటీన్లలో జరిగింది అని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. అవినీతి జరిగితే ఎంక్వయిరీ చేసి, బాధ్యులను లోపల వెయ్యాలి కానీ, ఇలా కడుపు కాడ కూడు లాగేయ్యటం ఏంటి అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మంత్రి బొత్సా సత్యన్నారాయణ చేసిన ప్రకటన చూస్తే మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అన్న క్యాంటీన్లకి బిల్డింగ్ లు అవసరం లేదని బొత్సా చెప్పారు. మేము వాటి స్థానంలో మొబైల్ క్యాంటీన్లు అంటే సంచార క్యాంటీన్లు తీసుకు వస్తామని బొత్సా అంటున్నారు. ఎక్కడ ప్రజలు ఉంటే, అక్కడకు ఈ సంచార వాహనాలు వెళ్తాయని, ఇలా ప్లాన్ చేస్తున్నామని బొత్సా చెప్పారు. ముందుగా రద్దీ ఎక్కడ ఉందొ చూస్తాం, ప్రజల వద్దకే ఈ సంచార క్యాంటీన్లని తరలిస్తామని బొత్సా చెప్పారు.

anna 03082019 3

అయితే, ఇది అంతా సాధ్యం అయ్యే పనేనా ? రద్దీ ఉన్న ప్రతి చోటా, ప్రజలు వచ్చి భోజనం చేస్తారా ? ఒక చోట ఉంటే, ఆకలి ఉన్న వాడు వచ్చి తింటాడు. మరి ప్రభుత్వం ఈ ఆలోచన ఎందుకు చేస్తుందో మరి ? ఇది ఇలా ఉంటే, ఇప్పుడు ఒక కొత్త భయం మొదలైంది. శుభ్రమైన వాతావరణంలో పెదులు అన్నం తినాలని, చంద్రబాబు మంచి భవనాలు కట్టారు. ఇప్పుడు బొత్సా గారు, సంచార క్యాంటీన్లు అంటున్నారు. అలాగే అసలు భవనాలు అవసరం లేదు అంటున్నారు. మరి, ఇప్పటికే ఉన్న మంచి మంచి భవనాలు ఏమి చేస్తారు అనే వాదన కూడా మొదలైంది ? ఈ భవనాల్లో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరుస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కాని అది రాజకీయ ఆరోపణ గానే తీసి పారెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉన్న చోట, మద్యం దుకాణాలు పెట్టటానికి, రూల్స్ ఒప్పుకోవు. అయినా ప్రభుత్వం ఆ సాహసం చెయ్యలేదు. మరి ఈ భవనాలను ఏమి చేస్తారు ? ఇప్పటికే 150 కోట్ల అవినీతి అంటున్నారు కాబట్టి, ప్రజా వేదిక లాగా, కూల్చేస్తారా ? బొత్సా గారు, అన్న క్యాంటీన్లకు భవనాలు అవసరం లేదు అని ఎందుకు అన్నారు ? కాలమే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read