పేదవాడికి రూ.5 కే కడుపు నిండా భోజనం పెట్టటం కోసం, చంద్రబాబు అన్న క్యాంటీన్లను తీసుకొచ్చారు. ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో, క్వాలిటీ భోజనం, 5 రూపాయలకే పేదలకు అందించి, వారి కడుపు నింపారు. అయితే, ప్రభుత్వం మారటం, జగన్ రావటంతో, ఇప్పటికే తాత్కాలిక ఏర్పాట్లలో సాగుతున్న అన్న క్యాంటీన్లు మూత పడ్డాయి. అంతే కాదు, చాలా చోట్ల అన్న క్యాంటీన్ భావనలకు ఉన్న రంగులు మార్చేస్తున్నారు. "అన్న" అనే పేరు కూడా లేపెసారు. సరి ఎన్ని చేసినా, ప్రజలకు టైంకు భోజనం పెడితే చాలు అని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే, ప్రతి రోజు 5 రూపాయిలకే భోజనం అందదేమో అనే భయంతో పేదలు ఉన్నారు. తాజాగా వస్తున్న వార్తలు చూస్తుంటే, వీరు బాధలో అర్ధముందేమో అనిపిస్తుంది.

annacanteen 28072019 2

అసలకే అన్న క్యాంటీన్లు ఎత్తేస్తారా, లేకపోతే మరో ప్రత్యామ్న్యాయంతో వస్తారా అనేది తెలియటం లేదు. ఏదైనా ఇప్పటి వరకు వస్తున్న వార్తలు అయితే, మరో మూడు రోజులు మాత్రమే అన్న క్యాంటీన్ లు ఉంటాయి. ఆగష్టు 1 నుంచి, ఉంటాయో ఉండవో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి, అన్న క్యాంటీన్లకు భోజనం కాంట్రాక్టు చేస్తున్న అక్షయపాత్రకు , ఈ విషయంలో మౌఖిక ఆదేశాలు వెళ్ళాయి. ఈ నెల ఒకటవ తేది నుంచి, సరఫరా నిలిపివెయ్యలని, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టరేట్‌ నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ ఆదేశాలను ఆయన పట్టణాలు, నగరాల్లో ఉన్న కమీషనర్లు అక్షయపాత్రకు కూడా తెలిపారు. అయితే తరువాత నుంచి ఏమి చేస్తారు అనేది మాత్రం ఎక్కడా క్లారిటీ లేదు.

annacanteen 28072019 3

అయితే వేరే పేరుతొ, వేరే మెనూతో, ఇలా మొత్తం మార్చేసి, మళ్ళీ కొత్తగా, జగన్ స్టైల్ లో వస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే అప్పటి వరకు భోజనం పెట్టకుండా ఆపటం పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. నిజానికి జూన్ నెల నుంచి భోజనాల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు. జూలై నెలకు మరింత తగ్గించారు. ఆగష్టు నెల వచ్చేసరికి, ఏకంగా భోజనమే బంద్ అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ 5 రూపాయిల భోజనం, వలస కూలీలు, కార్మికులు, పనుల మీద వచ్చే పేదవర్గాలకు ఆకలి తీర్చాయి. హోటల్ కు వెళ్లి తినాలి అంటే, 80 నుంచి వంద రూపాయల పైన అవుతుంది. అంత ఖర్చు పెట్టలేక, చాలా మంది పస్తులు ఉండేవారు. వీరి బాధలు గ్రహించి, చంద్రబాబు 5 రూపాయలకే ఉదాయం టిఫిన్, మధ్యానం భోజనం, రాత్రి భోజనం, 5 రూపాయలకే లభించేలా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read