వైఎస్ వివేక కేసు, చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో అప్రూవర్ గా మారి, న్యాయమూర్తి ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి పైన, ఇప్పుడు మరో ట్విస్ట్ ఏర్పడింది. దస్తగిరిని అప్రూవర్ గా మార్చటం, ఆ తరువాత అతన్ని అరెస్ట్ చేయకుండా, క్షమాభిక్ష పెట్టినట్టుగా, సిబిఐ తమ అఫిడవిట్ లో పేర్కొనటం పైన, ఎర్ర గంగిరెడ్డి దీన్ని హైకోర్టులో సవాల్ చేసారు. రెండు రోజుల క్రితం పిటీషన్ వేయగా, దీని పైన ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, ఆదినారాయణ రావు, వాదనలు వినిపించారు. సిబిఐ ఏదైతే క్షమా భిక్ష పెట్టటం, అది క్షామార్హం కాదని కూడా ఆయన వాదనలు వినిపించారు. ఈ విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి, 164 స్టేట్మెంట్ ఇస్తే, న్యాయమూర్తి ముందు, దాన్ని మీరెలా ఎలా పరిగణలోకి తీసుకుంటారని, ఆ విధంగా ఆయన్ను అరెస్ట్ చేయకుండా వదిలి వేయటం పైన కూడా, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది ఐపీసిలోని పలు సెక్షన్ లను ఉల్లంఘించినట్టే అని ఆయన వాదనలు చేసారు. అయితే సిబిఐ మాత్రం, తాము కౌంటర్ వేసేందుకు సమయం కావలని, హైకోర్ట్ ని సిబిఐ అభ్యర్ధించింది. దీంతో హైకోర్టు, సిబిఐ కౌంటర్ తరువాత, ఇరు వాదనలు పరిశీలించిన అనంతరం, ఒక నిర్ణయం ప్రకటిస్తామాని చెప్పింది.

viveka 14122021 2

సిబిఐ కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ, ఈ నెల 24వ తేదీకి కేసుని వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే, వివేక మాజీ పీఏ కృష్ణా రెడ్డి, నిన్న కడప ఎస్పీని కలవటం, మరో చర్చకు దారి తీసింది. తనకు వివేక కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని, తనను కాపాడాలని, కడప ఎస్పీని కలిసి వేడుకున్నారు. కృష్ణా రెడ్డి దాదాపుగా, 30 ఏళ్ళ పాటు, వివేక పీఏ గా పని చేసారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, ఆయనకు వివేక కుమార్తె, అలాగే వివేక అల్లుడు, వివేక బావ మరిది నుంచి ప్రాణ హాని ఉందని చెప్పటం, మరో హైలైట్. ఆయన ఫిర్యాదును పోలీసులు తీసుకుని, విచారణ జరుపుతున్నారు. గత కొన్ని రోజులుగా, ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. దీంతో కొత్తగా వివేక కూతురు, అల్లుడుని టార్గెట్ చేస్తూ జరుగుతున్న వ్యవహారం పలువురుని ఆశ్చర్యనిక గురి చేస్తుంది. ఇది ఎక్కడి వరుకు వెళ్తుందో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. మరో పక్క, ఈ కేసులు పెద్దలను ఇప్పటి వరకు సిబిఐ విచారణ చేయటం లేదనే, ప్రచారం కూడా జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read