అమరావతి రైతుల పై మళ్ళీ కేసులు పెట్టారు. గతంలో పొరుగు ఊరుల నుంచి మూడు రాజధానుల అంటూ, దీక్షలు, ధర్నాలు పేరుతో ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారు అంటూ, రెండు నెలల క్రిందట, అమరావతి రైతుల పైనే ఎదురు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయితే అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనం అయ్యింది. చివరకు కోర్టు చీవాట్లు పెట్టటంతో, ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. తాజాగా ఉద్దండరాయనిపాలెంలో, అమరావతి ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం అందించేందుకు, ప్రవాసాంధ్రులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆ సమయంలో కార్యక్రమం ముగిసిన తరువాత, మహిళా రైతులు ఇంటింటింకీ వెళ్లి, అమరావతి ఉద్యమంలో ఇంకా పెద్ద ఎత్తున పాల్గునాలని ఉద్యమం చేసారు. ఈ సందర్భంగా, అదే ఊరిలో ఉన్న ఎంపీ నందిగామ సురేష్ ఇంటి వద్ద, జై అమరావతి అనే నినాదాలు చేసారని, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారని, తమను రెచ్చగొట్టారు అంటూ, మూడు రాజధానుల శిబిరం నుంచి, ఎంపీ మనుషులు వచ్చి, అమరావతి శిబిరం మీదకు వచ్చారు. వారం క్రితం ఈ విషయంలో పరస్పరం వాగ్వాదం జరిగి, అమరావతి రైతులు రాత్రంతా చలిలో కుర్చుని నిరసన తెలపటం, పోలీసులు చర్చలు చేయటం, చివరకు పోలీసులు హామీతో, నిరసన విరమించటం తెలిసిందే.
అయితే ఆ సమయంలో తమను కులం పేరుతో దూషించారు అంటూ, మూడు రాజధానుల శిబిరంలో ఉన్న కొంత మంది, కేసులు నమోదు చేయటంతో, అప్పట్లోనే 5 గురు అమరావతి రైతుల పై కేసులు పెట్టారు. అయితే అప్పుడే ఎంపీ నందిగామ సురేష్ ని కూడా కులం పేరుతో దుషించారని, 19 మంది పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించి కేసు నెంబర్ లు కూడా ఇవ్వటం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసులు రైతుల పై నమోదు చేసారు. మొత్తంగా 24 మంది పై కేసులు నమోదు అయ్యాయి. అయితే రైతుల తరుపున కూడా ఎదురు కేసు పెట్టగా, ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. దాని పై కూడా కేసు నమోదు అయినట్టు సమాచారం. మొత్తంగా మూడు రాజధానుల శిబిరం వారు కావచ్చు, ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు అమరావతి రైతుల పై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీంతో మరోసారి ప్రభుత్వం, అమరావతి రైతుల పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినట్టు అయ్యింది. అయితే ఇది కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు పెట్టారని, తమ పని తాము చేసుకుంటుంటే, తమ పైకి వచ్చి, ఎదురు తమ పై కేసులు పెట్టటం ఏమిటని రైతులు వాపోతున్నారు.