మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ చైర్మెన్ అశోక్‍గజపతిరాజుకు వరుస షాకులు ఇస్తుంది ప్రభుత్వం. నిన్న జరిగిన సంఘటన పై, రాత్రి హడావిడిగా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో, అశోక్ గజపతి రాజు పైన కేసు నమోదు చేయటం, విస్మయానికి గురి చేస్తుంది. పోలీసుల కేసు కంటే ముందే, దేవస్థానంకు చెందిన అధికారులకు, మంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని, ప్రచారం జరుగుతుంది. నిన్న రామతీర్ధంలో పనులు ప్రక్రియ జరిగే అప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఊగిపోతూ ఒక విషయం చెప్పారు. ఇక పై అశోక్‍గజపతిరాజు ఇలాగే వ్యవహరిస్తే, తాము ఆయన పై చట్ట పరమైన చర్యలకు వెనుకాడమని చెప్పి, రాత్రి ఒక అడుగు ముందుకు వేసి, రామతీర్ధం దేవస్థానం అధికారులు, ఈవోతో పాటు, పోలీస్ స్టేషన్ కు పంపి ఫిర్యాదు చేపించారని ప్రచారం జరుగుతుంది. అశోక్‍గజపతిరాజు తమ విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, తమ ఫిర్యాదులో పేర్కుని నెల్లిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలోనే, ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు, పోలీసులు మాత్రం ఎక్కడా కేసు నమోదు చేసినట్టు బయటకు చెప్పలేదు కానీ, ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేసేసారు. 473, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
అశోక్‍గజపతిరాజుతో పాటుగా, మరికొంత మంది పైన కేసులు నమోదు చేసారు. వైసీపీ నేతలు అశోక్‍గజపతిరాజు పైన దూకుడుగా ప్రవర్తిస్తున్న నేపధ్యంలో, అడ్డుకున్న టిడిపి నేతల పైన కూడా కేసులు నమోదు చేసారు. పూజలు చేస్తున్న సమయంలో అశోక్‍గజపతిరాజు తీరు ఇబ్బందిగా మారిందని, పూజా కార్యక్రమాలకు ఇబ్బంది కలిగిందని, శిలాఫలకం కూడా పడేసారని ఫిర్యాదు చేసారు. అయితే ఈ మొత్తం అంశం పైన ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆందోళనకు పిలుపు ఇచ్చింది. ఈ రోజు అశోక్‍గజపతిరాజు కూడా పదకొండు గంటలకు మీడియా ముందుకు వచ్చి, జరిగిన విషయం పై స్పందించనున్నారు. నిన్న రామతీర్ధంలో శంకుస్థాపన సమయంలో, ధర్మకర్త అయిన అశోక్‍గజపతిరాజుని అడుగడుగునా అవమానించారు. శిలాఫలకం పైన ధర్మకర్త పేరు పెట్టలేదు. అలాగే అశోక్‍గజపతిరాజుని అవమానించారు. దీని పై నిరసన తెలిపిన అశోక్‍గజపతిరాజు పై, ఇప్పుడు కేసులు పెట్టి, ఆయన్ను మరింతగా అవమానపరుస్తూ, తమ కక్ష తీర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది.