ఇప్పటికే విజయవాడలో దుర్గ గుడి దగ్గర, బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే... బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ షడ్యుల్ ప్రకారం నడుస్తున్నా, దుర్గ గుడి ఫ్లై ఓవర్ మాత్రం నెమ్మదిగా నడుస్తుంది... ఇవి ఇలా ఉండగా, ఇప్పుడు మరో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుంది అనే సంకేతాలు వస్తున్నాయి... రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు ఐదు కిలో మీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మించే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒక పక్క గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే విఐపి మూమెంట్ ఉండటం, ఎక్కువ కాలేజీలు, ఆఫీసులు, స్కూల్స్ రావటంతో, గన్నవరం నుంచి ఎనికేపాడు దాకా కొంచెం ఫ్రీ గా ఉన్నా, ఎనికేపాడు నుంచి బెంజ్ సర్కిల్ వరకు నరకం కనిపిస్తుంది... ప్రధానంగా సిటీలోకి భారీ వాహనాలు రావటంతో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భంగా నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య పై అనేక ఫిర్యాదులు అందటం, అలాగే 1100 కు ఎక్కువ ఫిర్యాదులు దీని మీద రావటంతో, ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

vij flyover 09122017 2

రామవరప్పాడు నుంచి ఎనికేపాడు వరకు ప్రస్తుతం రెండు లైన్ల రోడ్డు ఉంది. దీనిని విస్తరించాలంటే రహదారికి ఇరు వైపులా నివాస, వాణిజ్య భవనాలు అధికంగా ఉన్నాయి. రామవరప్పాడు - ప్రసాదంపాడు మధ్య 70 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. దీనిని రెట్టింపు విస్తరిస్తే గానీ ట్రాఫిక్ ఇబ్బందులు తీరవు. అందుకు భూమి కావాలి. సేకరించాలంటే రెండు వైపులా ఉన్న ప్రైవేటు ఆస్తులకు భారీగా పరిహారం చెల్లించాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా రామవరప్పాడు - ఎనికేపాడు మధ్య ప్రస్తుతం ఉన్న రోడ్డుపైనే ఫ్లై ఓవర్ నిర్మాణం చేపడితే తక్కువ వ్యయం అవుతుందని అంచనాకు వచ్చారు.

vij flyover 09122017 3

రోడ్డు విస్తరణ చేపడితే 1350 కోట్లు అవుతాయని, అదే ఫైఓవర్ నిర్మిస్తే రూ. 500 కోటు వ్యయం సరిపోతుందని ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇది జాతీయ రహదారి అవడంతో కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖ అనుమతి కూడా అవసరం. రాష్ట్ర ప్రభుత్వం విస్తరణకు వెళ్లడమా? ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని చేపట్టడమా? అన్న అంశం పై రాష్ట్ర ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చి ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి రాయాల్సి ఉంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read